Director Maruthi: హీరో నితిన్(Actor Nithin), డైరెక్టర్ మారుతీ(Director Maruthi). ఇద్దరూ ఇద్దరే, ప్రస్తుతం కెరీర్ లో గడ్డు కాలాన్ని ఎదురుకుంటున్నారు. ఇద్దరికీ ప్రస్తుతం ఒక భారీ హిట్ కావాలి, లేదంటే కెరీర్లు పూర్తిగా ముగిసిపోయినట్టే. నితిన్ మంచి స్టోరీ దొరికితే కం బ్యాక్ ఇస్తాడనే నమ్మకం అందరిలో ఉంది. కానీ డైరెక్టర్ మారుతి పై ఆ నమ్మకం ఇప్పుడు ఎవరిలోనూ లేదు. ‘రాజా సాబ్’ కోసం ఆయన ప్రస్తుత తెలివి మొత్తాన్ని ఉపయోగించేసాడు. అది ఎంత అవుట్ డేటెడ్ గా ఉందో జనాలు ఫలితం రూపంలో చెప్పకనే చెప్పేశారు. అయితే వీళ్లిద్దరు ఇప్పుడు ఒకే సీజన్ పై, ఒకే టైటిల్ తో కొట్లాడుకునేందుకు సిద్ధం అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నితిన్ లేటెస్ట్ గా ‘ఆయ్’ మూవీ డైరెక్టర్ అంజి తో ఒక సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యాలని ప్లాన్.
ఈ చిత్రానికి ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారట. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక మారుతీ విషయానికి వస్తే రీసెంట్ గానే ఈయన ఫిల్మ్ ఛాంబర్ లో ‘హ్యాపీ పొంగల్’ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించాడు. ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారట. ఇందులో హీరోగా సాయి ధరమ్ తేజ్ నటించే అవకాశాలు ఉన్నాయి. ఇలా వీళ్లిద్దరు ఒకే టైటిల్ తో, ఒకే సీజన్ లో రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరిలో ఎవరో ఒకరు కచ్చితంగా తగ్గాల్సిందే. నితిన్ సంక్రాంతి పోటీ నుండి తప్పుకునే అవకాశం లేదు. ఇక మారుతీ కి కూడా కం బ్యాక్ ఇవ్వాలంటే సంక్రాంతి తప్ప మరో సీజన్ కనిపించడం లేదు. ఇద్దరు ఇదే సీజన్ లో రావాలి కాబట్టి, ఎవరు ఒకరు టైటిల్ ని మార్చుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ ఇద్దరూ కూడా తగ్గకుండా, ఒకే టైటిల్ తో రిలీజ్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఇలాంటి వింత సంఘటన ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో ఎప్పుడూ జరగలేదు. సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలైనా ఆడియన్స్ కంటెంట్ బాగుంటే ఆదరించడానికి రెడీ గా ఉంటారు . ఈ సంక్రాంతికి 5 సినిమాలు విడుదలైతే మూడు చిత్రాలు హిట్ అయ్యాయి. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఇది ఎలాంటి సీజన్ అనేది. మరి వీళ్ళిద్దరిలో వచ్చే ఏడాది జరగబోయే పోటీ లో ఎవరు విజయం సాధించబోతున్నారు అనేది చూడాలి. వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఇలా అందరూ కూడా పోటీ పడబోతున్నారు. క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ మధ్య వీళ్లిద్దరు పోటీ పది గెలవగలరా లేదా అనేది చూడాలి.