
2017 సెప్టెంబర్ 29 న శర్వానంద్ హీరో గా మారుతి దర్శకత్వం లో ‘మహానుభావుడు’ అనే సినిమా వచ్చింది. శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణ కూడా పొందింది. కథ ప్రకారం ఈ సినిమాలో శర్వానంద్ అతి శుభ్రం పాటిస్తూ ఉంటాడు. ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం .. ఒకవేళ అవతలివారు ఇస్తే, వెంటనే శానిటైజర్ వాడటం .. హాస్పిటల్ కి వెళితే మాస్క్ ధరించడం .. ఎవరైనా తుమ్మబోతే వాళ్లకి ఆమడ దూరం పారిపోవడం .. హీరోయిన్ ను హత్తుకోవడానికి కూడా ఆలోచించడం వంటివి చూసి అంతా నవ్వుకున్నారు. ఆ టైం లో కొంతమంది విమర్శకులు అతి ఎక్కువైందని కూడా విమర్శించారు. కానీ ఇప్పుడు ప్రపంచ మంతా మహానుభావుడు సినిమాలో హీరో చెప్పినదాన్ని పాటిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అంతకు మించి శుభ్రత పాటిస్తున్నారు.
కాగా ఈ విషయాన్ని మారుతి ప్రస్తావిస్తూ కరోనా వైరస్ నేపథ్యంలో అంతా మా సినిమాను గుర్తు చేసుకోవడం .చాలా ఆశ్చర్యంగా వుంది. ప్రస్తుత పరిస్థితికి అన్వయిస్తూ కామెడీగా కామెంట్లు పెట్టడం అంతా వింతగా వుంది. అదే విషయంలో మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మహానుభావుడు సినిమాను ఇంకా బాగా తీసేవాడినని మారుతి తెలియజేశాడు.
He is the real creator