https://oktelugu.com/

Director Krish Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ నుండి డైరెక్టర్ క్రిష్ అవుట్.. ఇక నుండి మొత్తం త్రివిక్రమే!

మరికొంతమంది అయితే ఫైనాన్సియల్ సమస్యలు తలెత్తడం వల్ల తాత్కాలికంగా ఈ సినిమాని నిలిపి వేశారని చెప్పుకొచ్చారు, అలాగే పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా ఇవ్వడం లేదంటూ రూమర్స్ వచ్చాయి. అయితే వీటిల్లో ఏ ఒక్కటి కూడా నిజం కాదని తెలుస్తుంది. ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ లేకపోవడం వల్లే , పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ ని హోల్డ్ లో పెట్టాడని,సెకండ్ హాఫ్

Written By:
  • Vicky
  • , Updated On : June 8, 2023 / 05:03 PM IST

    Director Krish Hari Hara Veera Mallu:

    Follow us on

    Director Krish Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఆయన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పీరియాడిక్ జానర్ సినిమా. ఎప్పుడో మూడేళ్ళ క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఇంకా పూర్తి కాకపోవడం పై సోషల్ మీడియా లో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. చాలామంది ఈ సినిమా ఆగిపోయింది అంటూ ప్రచారం చేసారు.

    మరికొంతమంది అయితే ఫైనాన్సియల్ సమస్యలు తలెత్తడం వల్ల తాత్కాలికంగా ఈ సినిమాని నిలిపి వేశారని చెప్పుకొచ్చారు, అలాగే పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా ఇవ్వడం లేదంటూ రూమర్స్ వచ్చాయి. అయితే వీటిల్లో ఏ ఒక్కటి కూడా నిజం కాదని తెలుస్తుంది. ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ లేకపోవడం వల్లే , పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ ని హోల్డ్ లో పెట్టాడని,సెకండ్ హాఫ్ కి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ ని ఎప్పుడైతే సిద్ధం చేస్తారో అప్పుడే షూటింగ్ చేద్దామని పవన్ కళ్యాణ్ క్రిష్ కి చాలా కచ్చితంగా చెప్పాడట.

    అందుకోసం పవన్ కళ్యాణ్ గత నెల 14 వ తేదీ వరకు క్రిష్ కి గడువు ఇచ్చారట. 15 వ తారీఖు నుండి సరికొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుందని పత్రిక ప్రకటనలు కూడా వచ్చాయి. కానీ డైరెక్టర్ క్రిష్ అప్పటికీ కూడా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చెయ్యకపోవడం తో అసహనం కి గురైన పవన్ కళ్యాణ్ ఇక క్రిష్ ని దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకోమని ఆదేశించాడట, అందుకే క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

    ఇప్పుడు సెకండ్ హాఫ్ కి సంబంధించిన స్క్రిప్ట్ మరియు డైలాగ్స్ ని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాయబోతున్నదట. తన కాంపౌండ్ లో ఉన్నటువంటి కొత్త డైరెక్టర్ కృష్ణ చైతన్య ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. పవన్ కళ్యాణ్ ఈ సినిమా పట్ల ఎంతో అంకిత భావం తో స్పెషల్ ఇంట్రెస్ట్ తో చేస్తున్నాడు. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ సినిమా విడుదల అయ్యే ఛాన్స్ ఉంది.