Director Jyothi Krishna: పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) కెరీర్ లో ఘోరమైన డిజాస్టర్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం రెండవ స్థానం లో ఉంటుంది. మొదటి స్థానం లో ‘అజ్ఞాతవాసి’ ఉంటుంది. అంటే ఆయన సినిమాలు ఎంత అట్టర్ ఫ్లాప్ అయినా కనీసం వీకెండ్ వరకు భారీ వసూళ్లు నమోదు అవుతుంటాయి. అలా కాకుండా, మొదటి రోజు మినహా, మిగలిన రోజుల్లో కనీస స్థాయి వసూళ్లను కూడా రాబట్టలేక చతికిల పడ్డ సినిమాల లిస్ట్ తీస్తే మొదటి స్థానం లో అజ్ఞాతవాసి, రెండవ స్థానం లో హరి హర వీరమల్లు, మూడవ స్థానం లో జానీ చిత్రం నిలుస్తుంది. అభిమానులు కూడా చీదరించుకున్న సినిమాలు ఇవి, అందుకే అలాంటి ఫలితాలను సొంతం చేసుకుంది. అభిమానులతో పాటు నెటిజెన్స్ కూడా పాపం నిర్మాత AM రత్నం పరిస్థితి ఏంటో?, అసలు తట్టుకోగలడా ఈ ఫలితాన్ని అంటూ ఆయన పై జాలి చూపించారు.
Also Read: రచ్చ రంబోలా.. నాని ప్యారడైజ్ తో ఏదో చేసేలా ఉన్నాడే..!
కానీ వాళ్ళు మాత్రం చాలా రిలాక్స్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గానే ఆయన కుమారుడు, ఈ చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ముందుగా యాంకర్ ఆయన్ని ఒక ప్రశ్న అడుగుతూ ‘హరి హర వీరమల్లు’ కి మీరు నష్టపోయారా? అని అడగ్గా, దానికి జ్యోతి కృష్ణ సమాధానం చెప్తూ ‘ మేము ఒక్క పైసా కూడా నష్టపోలేదు. నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే మేము పెట్టిన బడ్జెట్ మొత్తం వచ్చేసింది. మీ అందరికీ తెలిసిందే అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ చిత్రాన్ని రికార్డు రేట్ కి కొనుగోలు చేసింది. సాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడుపోయింది. సినిమా విడుదలకు ముందు వంద కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల నుండే జరిగింది. కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా దాటేసింది ఈ చిత్రం’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడిన ఈ మాటలను చూసి అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. మేము వీళ్ళ పరిస్థితి ఏంటో అని టెన్షన్ పడుతుంటే ఈయన ఇలాంటి కామెంట్స్ చేశాడేంటి?, అంటే ఈ సినిమా నుండి ఎవ్వరూ నష్టపోలేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ వాస్తవాలను గమనిస్తే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ ని అందుకోలేదు, పైగా నిర్మాత AM రత్నం కి ఉన్న అప్పులను తీర్చే బాధ్యత నాది అంటూ ముందుకొచ్చాడు. కాబట్టి నిర్మాత AM రత్నం సాధ్యమైనంత వరకు సేఫ్ జోన్ లోనే ఉండుంటాడు అంటూ సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో ఆ దేవుడికి, AM రత్నం కి మాత్రమే తెలియాలి.