Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Fans : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకి వణికిపోతున్న డైరెక్టర్ హరీష్ శంకర్

Pawan Kalyan Fans : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకి వణికిపోతున్న డైరెక్టర్ హరీష్ శంకర్

Director Harish Shankar : టాలీవుడ్ లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కి పర్యాయపదం లాంటి వాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..అభిమానులు ఆయనని ఒక ఆరాధ్య దైవం లాగ కొలుస్తారు..తమ అభిమాన హీరో ని అభిమానించే వారికి ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా ఇవ్వడానికి సిద్ధపడుతారు..అదే సమయం లో తమ అభిమాన హీరో మీద ఈగ వాలిన కూడా అల్లకల్లోలం సృష్టించేస్తారు..అందుకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అందరూ అంటూ ఉంటారు..ఇప్పుడు హరీష్ శంకర్ కి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి జీవితాంతం పండగ చేసుకునే రేంజ్ లో ‘గబ్బర్ సింగ్’ సినిమాని తెరకెక్కించి ఇచ్చిన డైరెక్టర్ ఆయన..గబ్బర్ సింగ్ సినిమా నుండి హరీష్ శంకర్ పై పవన్ ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమ ఎనలేనిది..మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుండో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసారు..వారి ఎదురు చూపులకు తెరదించుతూ ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాతో మీ ముందుకి మా కాంబినేషన్ మళ్ళీ రాబోతుంది అంటూ మూడేళ్ళ క్రితం ప్రకటించారు.

ప్రకటన అయితే వచ్చింది కానీ..ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు..అసలు ఈ చిత్రం ఉంటుందా లేదా అని అభిమానులు కంగారు పడుతున్న సమయం లో వచ్చే వారం లోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభించబోతున్నాము అని హరీష్ శంకర్ ఈరోజు ప్రకటించాడు..ఎప్పుడైతే ఆయన ట్వీట్ వేశాడో అప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ గురించి అసలు విషయం బయటపడింది..వీళ్లిద్దరి కాంబినేషన్ లో ప్రస్తుతం వస్తుంది ‘భవదీయుడు భగత్ సింగ్’ కాదని..తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన విజయ్ ‘తేరి’ సినిమాకి రీమేక్ అని ఒక వార్త రావడం తో అభిమానులు ఉగ్ర రూపం దాల్చేసారు.

6 ఏళ్ళ క్రితం తెలుగు మరియు తమిళం బాషలలో గ్రాండ్ విడుదలై , సూపర్ హిట్ గా నిలిచి, ఆ తర్వాత టీవీ లో ప్రతి వారం టెలికాస్ట్ చేస్తూనే ఉన్న సినిమాని రీమేక్ చేస్తే మేము సహించబోము..వెంటనే ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చెయ్యండి అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో పెద్ద ఎత్తున వ్యతిరేకతని చూపారు..గంట వ్యవధిలోనే రెండు లక్షల ట్వీట్స్ వేసి, అసలు ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన చెయ్యడానికే భయపడిపోయారు మూవీ టీం..మరి రేపైనా ఈ ప్రాజెక్ట్ గురించి ఒక క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version