Director Gopal: సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. ముఖ్యంగా హీరోయిన్లు అందచందాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. సినిమాల్లోకి వచ్చిన హీరోయిన్ కావాలనుకునేవారు ఎంతో అందంగా తయారవుతారు. అంద కోసం బ్యూటీ పార్లర్ కు కూడా వెళ్తుంటారు. అయితే ఒకప్పుడు సినీ హీరోయిన్లలో కొందరు గ్లామర్ అంటే ఎక్కువగా ఇంట్రెస్టు చూపేవారు కాదు. సాంప్రదాయంగా నటించాలని అనుకునేవారు. కానీ కొన్ని చోట్ల సీన్ డిమాండ్ చేసినప్పుడు డైరెక్టర్లు పట్టుబట్టి ఆ సీన్ ను చేయించేవారు. అలా ఓ ప్రముఖ డైరెక్టర్ స్టార్ హీరోయిన్ తో బాత్రూం సీన్ చేయించడానికి ప్రయత్నించాడు. కానీ చివరికి ఏం జరిగిందంటే?
ప్రముఖ డైరెక్టర్ బి. గొపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాక్షన్ సినిమాలు తీయడంలో ఆయనకు మించిన వారు లేరని ఇండస్ట్రీలో అనుకుంటారు. ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్ర రావు వద్ద శిక్షణ తీసుకున్న గోపాల్ ఆ తరువాత ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు. ఈయన తీసిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ అయిన వాటిలో ‘అసెంబ్లీ రౌడీ’ ఒకటి. మోహన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లు సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమా వస్తే తప్పకుండా చూస్తారు.
అలాంటిది ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ హాట్ టాపిక్ అవుతోంది. ఇందులో దివంగత అందాల తార దివ్య భారతి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అమె ఇందులో ఎంతో సాంప్రదాయంగా కనిపించారు. దివ్య భారతికి గ్లామర్ సినిమాలంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. కొన్ని సీన్స్ చేయలేనని తెగేసి చెప్పేదట. అయితే అసెంబ్లీ రౌడీలోని ఓ సీన్ చేయడాని బి గోపాల్ ఒత్తిడి చేశారట.
ఒకరోజు దివ్య భారతి షూటింగ్ కు సమయానికి రాలేదు. దీంతో అప్పటికే వచ్చిన మోహన్ బాబు హీరోయిన్ కోసం వేచి చూడడం ఆయనకు ఆగ్రహం తెప్పించినట్లయింది. దీంతో గోపాల్ వెంటనే ఆమె నివాసానికి వెళ్లగా ఆమె ఏడుస్తూ కనిపించింది. తాను బాత్రూం సీన్ చేయలేనని తన తల్లితో చెబుతూ వాపోయింది. అయితే దివ్య భారతి తల్లిగారు ఆమెతో ఎంతో సేపు మాట్లాడి ఈ సీన్ చేయడానికి ఒప్పించారు. అయితే ఆ సీన్ సినిమాకు హైలెట్ గా నిలిచిందని, ఆ తరువాత ఓ సందర్భంలో బి గోపాల్ తెలిపారు.