https://oktelugu.com/

Nandamuri Mokshagna:నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమాకి డైరెక్టర్ ఫిక్స్

Nandamuri Mokshagna: మన టాలీవుడ్ లో నందమూరి హీరోలకు ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మాస్ క్రేజ్ అంటే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది నందమూరి హీరోలే..స్వాతిగీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ మాస్ సినిమాలతో ఎన్నో బ్లాక్ బస్టర్లు మరియు ఇండస్ట్రీ హిట్లు కొట్టి తిరుగులేని మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు..ఇక ఆయన తర్వాత హరి కృష్ణ గారి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 1, 2022 / 05:57 PM IST

    Nandamuri Mokshagna

    Follow us on

    Nandamuri Mokshagna: మన టాలీవుడ్ లో నందమూరి హీరోలకు ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మాస్ క్రేజ్ అంటే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది నందమూరి హీరోలే..స్వాతిగీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ మాస్ సినిమాలతో ఎన్నో బ్లాక్ బస్టర్లు మరియు ఇండస్ట్రీ హిట్లు కొట్టి తిరుగులేని మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు..ఇక ఆయన తర్వాత హరి కృష్ణ గారి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే స్థాయి తిరుగులేని మాస్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు..ఇక ఆ తర్వాత నందమూరి ఫామిలీ నుండి వచ్చిన తారక రత్న మాత్రం హీరో గా సక్సెస్ కాలేకపోయాడు..ఇప్పుడు అందరి చూపు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తేజ్ మీదనే ఉంది..అప్పట్లో మోక్షజ్ఞ తేజ అసలు సినిమాల్లోకి వస్తాడా..ఆసక్తి ఉందా అని అభిమానుల్లో సందేహాలు ఉండేవి..కానీ బాలకృష్ణ మోసకాజ్ఞ తేజ సినిమాల్లోకి వస్తాడు అని..నందమూరి లెజసీ ని మోసే బాధ్యత వాడికి ఉంది అని బాలయ్య బాబు తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే.

    Mokshagna, Bala Krishna

    ఇక అప్పటి నుండి మోక్షజ్ఞ తేజ తోలి సినిమాకి దర్శకుడు ఎవరు అనే దానిపై సోషల్ మీడియా లో రకరకాల వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి..పూరి జగన్నాథ్ దర్శకత్వం లో మోక్షజ్ఞ లాంచ్ అవ్వబోతున్నాడు అని అప్పట్లో వార్తలు వచ్చాయి..అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు అని నందమూరి కుటుంబ వర్గాలు చెప్పుకొచ్చారు..ఇక ఆ తర్వాత బాలయ్య కి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూవీ ఉంటుంది అని కూడా వార్తలు వచ్చాయి..అయితే ఈ వార్త కూడా కేవలం పుకారు అని తేలిపోయింది..ఇప్పుడు లేటెస్ట్ గా మోక్షజ్ఞ తేజ మొదటి సినిమా బాధ్యతలు బాలయ్య బాబు అనిల్ రావిపూడి కి ఇచ్చినట్టు తెలుస్తుంది..పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2 ,సరిలేరు నీకెవ్వరూ మరియు F3 వరుస విజయాలతో అపజయమే ఎరుగని డైరెక్టర్ గా ముందుకి దూసుకుపోతున్న అనిల్ రావిపూడి త్వరలోనే బాలయ్య బాబు తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే.

    Balakrishna, Anil Ravipudi

    Also Read: YCP Bus Yatra Failure: అన్నీ చేస్తున్నా ప్రజాదరణ కరువు.. వైసీపీ నేతల్లో అంతర్మథనం

    ఈ సినిమా ఇక సెట్స్ మీదకి వెళ్లకముందే బాలయ్య బాబు కొడుకు కోసం ఒక్క స్క్రిప్ట్ ని రాసుకొని ఇటీవలే బాలయ్య ని కలిసి స్టోరీ వినిపించాడు అట..ఈ సినిమా అన్ని విధాలుగా ప్రేక్షకులను అలరించే విధంగా ఉండడం తో బాలయ్య వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది..ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే అనిల్ రావిపూడి ని ఇండస్ట్రీ కి పరిచయం చేసిందే నందమూరి కళ్యాణ్ రామ్..తన సొంత నిర్మాణ సంస్థ లో తెరకెక్కించిన పటాస్ సినిమా తర్వాత ఇండస్ట్రీ లో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు అనిల్ రావిపూడి..ఇప్పుడు నందమూరి అభిమానులు ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్న నందమూరి హీరో మోక్షజ్ఞ ని అనిల్ రావిపూడి లాంచ్ చెయ్యడం విశేషం..ఇది ఇలా ఉండగా త్వరలోనే అనిల్ రావిపూడి – బాలయ్య బాబు కాంబినేషన్ లో మూవీ ప్రారంభం కానుంది..ఈ సినిమాలో బాలయ్య బాబు కి కూతురుగా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నటిస్తుంది..ప్రస్తుతం F3 సక్సెస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న అనిల్ రావిపూడి త్వరలోనే బాలయ్య బాబు ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు బయటపెట్టనున్నాడు.

    Boyapati Srinu

    Also Read: Hero Gopichand: ఆ ఒక్క తప్పు హీరో గోపీచంద్ జీవితం ని తలక్రిందలు చేసింది

    Recomended Videos


    Tags