OG And Saaho: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పంతులు తక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. చాలామంది స్టార్ హీరోలు కొత్త కథలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పాన్ ఇండియాలో గత కొన్ని సంవత్సరాల వరకు బాలీవుడ్ ఇండస్ట్రీనే టాప్ లెవెల్లో ఉండేది. ఇక బాలీవుడ్ ని అందుకోవడం ఎవరి వల్ల కాదు అనే రేంజ్ లో మిగతా ఇండస్ట్రీ వాళ్ళు ఉండేవారు. కానీ రాజమౌళి చేసిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ప్రతి ఒక్క దర్శకుడు సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఓజీ సినిమాతో పాన్ ఇండియా సినిమాను చేశాడు. మరి ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాకి ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో మూవీ కి మధ్య ఏదైనా కనెక్షన్ ఉందా అనే వార్తలైతే వస్తున్నాయి. నిజానికి ఈ రెండింటి మధ్య ఏ కనెక్షన్ లేదని డైరెక్టర్ మొదట్లోనే క్లారిటీ ఇచ్చాడు.
అయినప్పటికి ఎప్పటికప్పుడు ఈ వార్తలు రావడం పట్ల పాలు రకాల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక సాహో సినిమా కథ వేరు ఈ సినిమా కథ వేరని రెండింటికి మధ్య కనెక్షన్ లేదని సినిమా యూనిట్ నుంచి కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా కొంతమంది అభిమానులు మాత్రం సినిమా రిలీజ్ అయితే గాని, వాళ్లకు ఈ విషయం మీద పూర్తి క్లారిటీ రాదని చెబుతున్నారు.
ఎందుకంటే సినిమాలో ఒక సస్పెన్స్ ఎలిమెంట్ గా దాన్ని వాడుకోబోతున్నారని అది ముందే చెబితే ప్రేక్షకుల్లో థ్రిల్ ఉండదనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారంటూ మరి కొంతమంది అభిమానులు చెబుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాకి సాహో మూవీకి మధ్య సంబంధం లేదని తేల్చి చెప్పినా కూడా అభిమానులు నమ్మకలేకపోతున్నారు…
ఇక ఇదిలా ఉంటే ఓజీ మూవీ పాన్ ఇండియాలో ఉన్న పలు రికార్డులను బ్రేక్ చేస్తుందంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓజీ కి ఉన్న హైప్ కనక చూసినట్టయితే ఈ సినిమాకు సక్సెస్ ఫుల్ టాక్ వస్తే మాత్రం ఈ మూవీ 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుందనేది వాస్తవం…