Uppena Director: నందమూరి హీరోతో బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా!

Uppena Director: కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్ లో విడుదలైన మొదటి చిత్రం “ఉప్పెన”. అటు డైరెక్టర్ కి హీరోకి హీరోయిన్ కి సూపర్ హిట్ ఇచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోగా వైష్ణవ్ తేజ్‌కు , హీరోయిన్ గా కృతి శెట్టి పరిచయం అయ్యారు. ఈ ఇద్దరు వరస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఈ సినిమా దర్శకుడు మంచి ఆఫర్స్ వస్తున్నాయట. ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా ని టాలీవుడ్ స్టార్ […]

Written By: Raghava Rao Gara, Updated On : November 19, 2021 1:59 pm
Follow us on

Uppena Director: కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్ లో విడుదలైన మొదటి చిత్రం “ఉప్పెన”. అటు డైరెక్టర్ కి హీరోకి హీరోయిన్ కి సూపర్ హిట్ ఇచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోగా వైష్ణవ్ తేజ్‌కు , హీరోయిన్ గా కృతి శెట్టి పరిచయం అయ్యారు. ఈ ఇద్దరు వరస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఈ సినిమా దర్శకుడు మంచి ఆఫర్స్ వస్తున్నాయట. ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా ని టాలీవుడ్ స్టార్ హీరో తో సిద్ధం అవుతున్నారు దర్శకుడు బుచ్చిబాబు.

దర్శకుడు బుచ్చిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరికీ తెలిసిన వ్యక్తి. ఎందుకంటే సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. తాను తెరకెక్కిన ఉప్పెన సినిమా కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు నందమూరి కుర్రోడు తో ఒక సినిమా తెరకెక్కనుంది.

అయితే ముందస్తు చేసుకున్న ఒప్పందం ప్రకారం మైత్రీవారితోనే రెండవ సినిమా కూడా చేయాల్సి ఉందని సమాచారం. ఈ సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించబోతున్నట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పకనే చెప్పాడు. ఇప్పటికే ఎన్.టి.ఆర్‌కు కథ చెప్పి ఒప్పించిన తను ప్రస్తుతం పూర్తి స్థాయిలో కథ కొన్ని మార్పులు చేసి త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారట. అయితే బుచ్చిబాబు కి జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానాన్ని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ఆ అభిమానంతో ఎన్టీఆర్ కి ఏ రేంజ్ హిట్ ఇవ్వబోతున్నారు అనేది త్వరలో తెలియనుంది.