Director Atlee : కొంతమంది దర్శకులు డబ్బుకంటే ఎక్కువగా పని మీదనే ఇష్టం చూపిస్తారు, డబ్బు కోసం వెంపర్లాడే దర్శకులను మనం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో చాలా తక్కువ మందిని చూసి ఉంటాము. ఒక స్టార్ హీరో సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ ఇస్తే పైసా అడ్వాన్స్ కూడా తీసుకోకుండా పని చేసే డైరెక్టర్స్ ఇండస్ట్రీ లో ఉన్నారు. అలాంటి ఇండస్ట్రీ లో నేను కోరినంత డబ్బులు ఇస్తేనే సినిమా చేస్తాను, హీరో ఎవరు అనేది నాకు అనవసరం, ఎవరితోనైనా చేస్తాను, కానీ నాకు డబ్బే ముఖ్యం అంటూ మొండికేస్తున్నాడు ఒక స్టార్ డైరెక్టర్. ఆయన మరెవరో కాదు తమిళ టాప్ డైరెక్టర్ అట్లీ(Director Atlee). ఈయన తన కెరీర్ లో తీసిన అద్భుతమైన సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘రాజా రాణి’ మాత్రమే. ఆ తర్వాత ఆయన తీసిన ‘తేరి’, ‘మెర్సల్’, ‘బిజిల్’ వంటి చిత్రాలు కంటెంట్ పరంగా యావరేజ్ రేంజ్ అనుకోవచ్చు.
Also Read : ఆ దర్శకుడిని నాని అంత భయపెట్టాడా? నా సినిమా సేఫ్ అంటూ, సోషల్ మీడియా పోస్ట్
కేవలం విజయ్(Thalapathy Vijay) స్టార్ స్టేటస్ వల్ల ఆ సినిమాలు కమర్షియల్ గా బంపర్ హిట్స్ అయ్యాయి. 2023 వ సంవత్సరం లో ఆయన షారుఖ్ ఖాన్(Sharukh Khan) తో చేసిన ‘జవాన్’ సినిమా కూడా అంతే. కంటెంట్ పరంగా యావరేజ్ రేంజ్, కేవలం షారుఖ్ ఖాన్ స్టార్ స్టేటస్ కారణంగా ఆ సినిమా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. ఇలా వరుసగా సినిమాలు సక్సెస్ అవుతుందే లోపు అట్లీ కి రెక్కలు వచ్చాయి. కేవలం తన వల్లే సినిమాలు సూపర్ హిట్స్ అవుతున్నాయి అనే భ్రమలో బ్రతుకుతున్నాడు. ప్రస్తుతం ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) తో ఒక సినిమా కమిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాని సన్ పిక్షర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించేందుకు గాను అట్లీ ఏకంగా వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నాడట.
అంత ఇచ్చుకోలేము అని సన్ పిక్చర్స్ సంస్థ ముఖం మీదనే అట్లీ కి చెప్పిందట. కానీ మనోడు అసలు తగ్గడం లేదు. నువ్వు కాకపోతే ఇంకో డైరెక్టర్ నా కోసం వస్తాడు, నేను అయితే అడిగిన డబ్బులకు ఒక్క పైసా తక్కువ ఇచ్చినా సినిమా చేయను అని చెప్పేస్తున్నాడు. దీంతో అల్లు అర్జున్ మూవీ మళ్ళీ సమస్యల్లో చిక్కుకుంది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోలు ఉన్నారు కానీ, అంత స్థాయి రెమ్యూనరేషన్ తీసుకున్న డైరెక్టర్స్ మాత్రం లేరు. రాజమౌళి కూడా సినిమా విడుదలయ్యాక లాభాలు వచ్చినప్పుడు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. ఇక సందీప్ వంగ అయితే తానూ దర్శకత్వం వహించే సినిమాలకు తానే నిర్మాత కాబట్టి వచ్చే లాభాలన్నీ ఆయనకే. అట్లీ తల్చుకుంటే అలా చేయొచ్చు. కానీ నిర్మాతగా డేర్ చేసే ధైర్యం లేదు, విడుదలయ్యాక లాభాల్లో వాటాలు పంచుకునే సాహసం చేయలేదు, డబ్బులు మాత్రం అడిగినంత ఇచ్చేయాలి, ఇలాంటోడితో సినిమా చేయడం అవసరమా అని అభిమానులు అల్లు అర్జున్ ని అడుగుతున్నారు.
Also Read : కెరీర్ లో తొలిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్న అల్లు అర్జున్..పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!