https://oktelugu.com/

Anil Ravipudi: దృశ్యం 2 సినిమా గురించి స్పందించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి…

Anil Ravipudi: విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం వరుస సక్సెస్ లను అందుకుంటున్నారు. ఆయన చివరగా నటించిన నారప్ప చిత్రం ఘన విజయం సాధించగా… తాజాగా జీతు జోసెఫ్ తెరకెక్కించిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం 2’ లో నటించారు. మలయాళ దృశ్యం 2 చిత్రానికిది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో మీనా హీరోయిన్ గా నటించింది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 29, 2021 / 03:36 PM IST
    Follow us on

    Anil Ravipudi: విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం వరుస సక్సెస్ లను అందుకుంటున్నారు. ఆయన చివరగా నటించిన నారప్ప చిత్రం ఘన విజయం సాధించగా… తాజాగా జీతు జోసెఫ్ తెరకెక్కించిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం 2’ లో నటించారు. మలయాళ దృశ్యం 2 చిత్రానికిది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో మీనా హీరోయిన్ గా నటించింది. దృశ్యం మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ముఖ్యంగా ఇందులోని కోర్ట్ సీన్ ట్విస్ట్ కు ప్రేక్షకులు అంతా థ్రిల్ అవుతున్నారు. మోహన్ లాల్ నటనని వెంకీ బాగా మ్యాచ్ చేశారని ప్రశంసలు వస్తున్నాయి.

    ఈ క్రమంలో రీసెంట్ గా ‘దృశ్యం 2’ చిత్రాన్ని వీక్షించిన దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా గురించి స్పందించారు. వెంకటేష్ నటనను మెచ్చుకుంటూ ప్రసంశల వర్షం కురిపిస్తూ ట్వీట్ చేశారు. “ట్విస్టులు, టర్న్స్ తో ‘దృశ్యం 2’ సినిమా అద్భుతంగా అనిపించింది. రాంబాబుగా మన వెంకటేశ్ గారు మైండ్ గేమ్ తో అదరగొట్టారు. దృశ్యం 2 చిత్రాన్ని మిస్ అవ్వకండి అంటూ ట్వీట్ చేశారు. అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకీ, వరుణ్ లతో ‘ఎఫ్ 3’ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచె ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. అలానే నందమూరి నటసింహం బాలకృష్ణతో కూడా అనిల్ రావిపూడి ఒక సినిమా చేయనున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవికి కూడా ఒక స్క్రిప్ట్ చెప్పారని, చిరుకి ఆ స్క్రిప్ట్ విన్నవెంటనే ఓకే చెప్పారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.