Shyam Singha Roy Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో అవొచ్చు ఏమో గాని, హీరోగా తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకోవడం అంటే మాత్రం చాలా కష్టం. నందమూరి తారక రత్న, అల్లు శిరీష్, అక్కినేని సుశాంత్ లాంటి హీరోలకు బలమైన నేపథ్యాలు ఉన్నా.. వాళ్లకు ఎందుకు సినిమాలు ఆశించిన స్థాయిలో రావు, వచ్చినా ఆడవు అంటే.. అందుకు ప్రధాన కారణం.. స్వతహాగా మార్కెట్ లేకపోవడమే.

డబ్బులు ఉంటే సినిమా తీయొచ్చు, కానీ ఆ సినిమాని హిట్ చేయించడం, జనం చేత జేజేలు కొట్టించడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా సినిమా బాగుంటేనే ఆ సినిమాను జనం ఆదరిస్తారు. అలాగే హీరోకి మంచి టాలెంట్ ఉండాలి. అప్పుడే బాక్సాఫీస్ వద్ద సోలోగా ఒక క్రేజ్ వస్తోంది. హీరో నానికి ఈ రోజు ఓ మార్కెట్ క్రియేట్ అయింది అంటే.. అందుకు కారణం నాని టాలెంటే.
ప్రస్తుతం మిడిల్ రేంజ్ హీరోల్లో నాని ప్లేస్ టాప్ లో ఉంది. వాస్తవానికి నానికి మంచి బ్లాక్ బస్టర్ పడి చాలా కాలమే అయింది. అందుకే, నాని కూడా చాలా కాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. కాగా తాజాగా నాని నటించిన కొత్త సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. డిసెంబర్ 24న విడుదల కానుంది. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని నాని, ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే తన ఫ్యాన్స్ మరియు సన్నిహితులతో పాటు ఈ సినిమా బయ్యర్లను కూడా పిలిపించుకుని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మీటింగ్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దాదాపు రెండు వేల మంది అభిమానులు హాజరయ్యారు. వారందరికీ నాని, డిన్నర్ తో పాటు గిఫ్టులు కూడా ఇచ్చాడట. మొత్తానికి నాని చేసిన ఈ పనిని గమనిస్తే.. తనకు మోరల్ సపోర్ట్ ఇవ్వాలని అడిగేందుకే ఈ మీటింగ్ పెట్టుకున్నట్లు ఉన్నాడు.
Also Read: భారీ లెవెల్లో ప్రమోషన్స్ ప్లాన్ చేసిన “శ్యామ్ సింగరాయ్” టీమ్…
మరి డిసెంబర్ 24న విడుదల కానున్న ‘శ్యామ్ సింగ రాయ్’కి ఈ మీటింగ్ కి వచ్చిన వాళ్ళు ఏ రకంగా హెల్ప్ చేస్తారో చూడాలి. పైగా ఈ చిత్రాన్ని
దక్షిణాదిలోని అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: నాని ఆశలన్నీ శ్యామ్ సింగరాయ్ పైనే.. హిట్ కొడతాడా!