Aditya Dhar: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తూ, రోజుకి ఒక మైల్ స్టోన్ అందుకుంటూ, ట్రేడ్ పండితులను సైతం మెంటలెక్కిపోయేలా చేస్తున్న చిత్రం ‘దురంధర్'(Dhurandhar Movie). రణవీర్ సింగ్(Ranveer Singh) హీరో గా నటించిన ఈ సినిమా విడుదలకు ముందే ట్రైలర్ మరియు పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరో యానిమల్ రేంజ్ సినిమా అవ్వుద్దేమో అని అంతా అనుకున్నారు. కానీ చివరికి ‘యానిమల్’ ని సైతం దాటేసి ఇప్పుడు ‘పుష్ప 2′,’బాహుబలి 2’ ఫుల్ రన్ కలెక్షన్స్ టార్గెట్ గా ముందుకు దూసుకుపోతుంది. 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 940 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మరో రెండు మూడు రోజుల్లో వెయ్యి కోట్ల మార్క్ ని అందుకోనుంది. రేపు క్రిస్మస్ కావడం తో పాటు, ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి గొప్పగా కలిసొచ్చేలా అనిపిస్తుంది.
అయితే ఈ సినిమా విజయం పట్ల ఆ చిత్ర దర్శకుడు ఆదిత్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘దురంధర్ చిత్రానికి ఇప్పటి వరకు కోటికి పైగా టికెట్స్ అమ్ముడుపోవడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా సాధించిన అతి పెద్ద విజయం ఏమిటంటే, ఇప్పటి వరకు ఈ చిత్రానికి అమ్ముడుపోయిన ప్రతీ టికెట్ ఆర్గానిక్ గా జరిగినదే. విడుదలైన మొదటి రోజు కార్పొరేట్ బుకింగ్స్ అంటూ మాపై ఎగతాళి చేస్తూ ఏడ్చిన వారంతా ఇప్పుడు అకస్మాత్తుగా మౌనం వహిస్తున్నారు. భారతీయ సినీ చరిత్ర లో దురంధర్ చిత్రానికి ఇప్పుడు సరికొత్త పేజీలు ఉన్నాయి. ఆడియన్స్ ఈ చిత్రాన్ని చిరస్థాయిగా గుర్తించుకుంటారు. దేశం పై మాకున్న పిచ్చి ప్రేమకు నిదర్శనం ఈ దురంధర్ చిత్రం’ అంటూ చెప్పుకొచ్చాడు ఆదిత్య. ఈ చిత్రం విడుదలై నేటితో 20 రోజులు పూర్తి అయ్యింది. అయినప్పటికీ బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 22 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. దీన్ని బట్టీ చూస్తే ఈ సినిమా థియేట్రికల్ రన్ మరో నెల రోజుల వరకు కచ్చితంగా ఉండేలా అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.