Anasuya Bharadwaj: బుల్లితెరకు గ్లామర్ పరిచయం చేసిన ఘనత అనసూయదే. యాంకర్స్ అంటే శారీలు, చుడిదార్ లు ధరించాలనే సంప్రదాయాలను బ్రేక్ చేసి, మిడ్డీలు, హాట్ ట్రెండీ వేర్స్ ధరించి చూపించింది. జబర్దస్త్ తో పాటు కొన్ని టెలివిజన్ షోస్ లో అనసూయ గ్లామర్ షో హద్దులు దాటేసిన సందర్భాలు ఉన్నాయి. అనేవారు లేకుంటే ఇంకా శృతి మించడానికి సిద్ధమన్నట్లు అనసూయ తీరుంటుంది. ఇక అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ అనేకమార్లు వివాదాస్పదమైంది. పలువురు పలు సందర్భాల్లో ఆమె పొట్టి బట్టలపై కామెంట్స్ చేశారు. ఇంటిల్లపాది చూస్తే టెలివిజన్ షోస్ లో ఈ రేంజ్ గ్లామర్ షో అవసరమా అంటూ ప్రశ్నించారు.

ఆ మధ్య సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. అనసూయ చూడటానికి అందంగా ఉంటుంది. ఆమె ఎలాంటి బట్టలు వేసుకున్నా ప్రేక్షకులు చూస్తారు. అలాంటిది ఆ పొట్టి బట్టలు ధరించడం ఎందుకు? ఆ విషయంలో అనసూయ నాకు నచ్చదు అన్నారు. ఇక ఇలాంటి కామెంట్స్ ని అదే స్థాయిలో అనసూయ తిప్పికొడుతుంది. తనను విమర్శించిన వాళ్లకు కౌంటర్లు ఇస్తుంది.
Also Read: Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ అసలు పేరు తెలుసా…? తెలిస్తే పడి పడి నవ్వుతారు!
వయసులో, అనుభవంతో పెద్దవాడని కూడా చూడకుండా కోటాకు అనసూయ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. తాగుబోతులంటూ ఎదురుదాడికి దిగింది. నేను ఎలాంటి బట్టలు ధరించాలో చెప్పడానికి మీరెవరు అంటుంది అనసూయ. నా బట్టలు నా ఇష్టం అనేది ఆమె పాలసీ. ఈ విషయంలో ఆమెను సమర్ధించే వాళ్ళు లేకపోలేదు. తాజాగా సీనియర్ దర్శకుడు గీతా కృష్ణ అనసూయపై ప్రశంసలు కురిపించాడు.

అనసూయ మంచి నటి. రంగస్థలం చిత్రంలో ఆమె గొప్పగా నటించారు. పుష్ప మూవీలో అయితే ఆమెను నేను గుర్తుపట్టలేకపోయాను. అనసూయకు మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంది. ఆమెకు ఫ్యాషన్ పై అవగాహన ఉంది. ఆమెను చూసి చాలా మంది అసూయపడుతూ ఉంటారు. ట్రోల్స్ వేస్తూ ఉంటారు. కానీ అనసూయను అలా ట్రెండీగా చూడడమే నాకు ఇష్టం అన్నారు. అనసూయ డ్రెస్సింగ్ పై దర్శకుడు గీతా కృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక నాగార్జున, రమ్యకృష్ణ హీరో హీరోయిన్స్ గా 1987లో విడుదలైన సంకీర్తన చిత్రంతో గీతా కృష్ణ దర్శకుడిగా మారారు. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి గాను ఆయన బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా నంది అవార్డు గెలుచుకున్నారు. అనంతరం కీచురాళ్ళు, కోకిల, ప్రియతమా వంటి లవ్ ఎంటర్టైనర్స్ తెరకెక్కించారు. విజయాలు దక్కకపోవడంతో ఆయన ఫేడ్ అవుట్ అయ్యారు.
[…] Also Read: Anasuya Bharadwaj: అనసూయను అలాంటి డ్రెస్సులో చూడ… […]