Dilruba: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే యూత్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్న హీరోలలో ఒకరు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). ఇతని కెరీర్ ఆరంభంలో అద్భుతమైన సినిమాలు పడ్డాయి కానీ, ఆ తర్వాత వరుసగా డిజాస్టర్ సినిమాలు పడ్డాయి. కానీ ఆయన గత చిత్రం ‘క’ మాత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఆడియన్స్ ని షాక్ కి గురి చేసిన చిత్రమిది. ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ఇలాంటి కాన్సెప్ట్ మీద సినిమా తీయలేదు, ఇలాంటి సినిమా చేసినందుకు కిరణ్ అబ్బవరం ని మెచ్చుకోవలసిందే అంటూ విమర్శకులు సైతం ప్రశంసలు అందించారు. అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా'(Dilruba) అనే సినిమాతో మన ముందుకు ఈ నెల 14వ తేదీన రాబోతున్నాడు. ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు అయితే లేవు కానీ, మూవీ టీం మాత్రం ప్రొమోషన్స్ కుమ్ముతోంది.
Also Read: ‘రాజా సాబ్’ ఔట్పుట్ పై ప్రభాస్ తీవ్ర అసంతృప్తి..? 80 శాతం సన్నివేశాలను మళ్ళీ రీ షూట్ చేయబోతున్నారా!
నేడు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కిరణ్ అబ్బవరం ని విలేఖరులు ఎన్నో రకాల ప్రశ్నలు అడగగా, ఆయన ఆసక్తి కరమైన సమాదానాలు చెప్పాడు. ట్రైలర్ ని చూసిన తర్వాత మనకి ఈ సినిమా గురించి అర్థమైనది ఏమిటంటే, ఇందులో హీరో మాజీ ప్రేయసి, హీరో ని తన ప్రస్తుత ప్రేయసి తో కలిపే సందర్భం ఉందని తెలుస్తుంది. ఇది చూసిన తర్వాత మన అందరికీ రీసెంట్ గా విడుదలై సూపర్ హిట్ గా నిల్చిన ‘డ్రాగన్'(Dragon Movie) చిత్రం గుర్తుకొస్తుంది. ఈ సినిమా కూడా ఇదే లైన్ మీద తెరకెక్కిన సినిమానే అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని ఒక విలేఖరి కిరణ్ అబ్బవరం ని అడగగా, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘మా సినిమా ‘డ్రాగన్’ కంటే రెండు సంవత్సరాల ముందే సెట్స్ మీదకు వచ్చింది. అందులో అనుపమ గారు మాజీ ప్రేయసి గా కాసేపటి వరకే కనిపిస్తారు, కానీ మా సినిమాలో మాజీ ప్రేయసి పాత్రకు చాలా పెద్ద స్కోప్ ఉంది. స్టోరీ లైన్ ఒకేలా ఉన్నప్పటికీ, నేపథ్యం, కధనం, స్క్రీన్ ప్లే మొత్తం భిన్నమే, కాబట్టి డ్రాగన్ తో మా సినిమాకు పోలిక లేదు’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
Also Read: రెబల్ స్టార్ ప్రభాస్ కి తగిలిన గాయాలపై స్పందించిన టీం..కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ వార్నింగ్!