Dil Raju: టాలీవుడ్ లో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతలలో ఒకరు దిల్ రాజు(Dil Raju). మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వంటి సీనియర్ హీరోలతో తప్ప, దాదాపుగా అందరితోనూ ఈయన సినిమాలు చేసేశాడు. మీడియం రేంజ్ బడ్జెట్ తో తీసిన సినిమాలు బాగానే సక్సెస్ అయ్యాయి. కొత్త డైరెక్టర్స్ తో ఆయన సెన్సేషన్ సృష్టించాడు. కానీ స్టార్ హీరోలతో కాంబినేషన్స్ సెట్ చేసినప్పుడల్లా చేతులు కాల్చుకున్నాడు. ఈ సంక్రాంతికి విడుదల చేసిన రామ్ చరణ్(Globalstar Ramcharan) ‘గేమ్ చేంజర్’ చిత్రం అందుకు ఒక ఉదాహరణ. చాలా మితంగా డబ్బులు ఖర్చు చేసి సినిమాలు తీసే దిల్ రాజు, ‘గేమ్ చేంజర్’ చిత్రానికి 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ని ఖర్చు చేసాడు. ఆ సినిమాకి డిజాస్టర్ టాక్ రావడం తో 200 కోట్ల నష్టం వాటిల్లింది. సమయానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని కూడా విడుదల చేసాడు కాబట్టి సేఫ్ అయ్యాడు.
లేకపోతే దిల్ రాజు పరిస్థితి ఊహించడానికి కూడా భయపడాల్సి వచ్చేది. అయితే ‘గేమ్ చేంజర్’ కి ముందు అప్పట్లో దిల్ రాజు జూనియర్ ఎన్టీఆర్(Junior NTR), హరీష్ శంకర్(Harish Shankar) కాంబినేషన్ లో ‘రామయ్య వస్తావయ్యా’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా కూడా ‘గేమ్ చేంజర్’ లాగానే భారీ కాంబినేషన్ అనొచ్చు. ‘గబ్బర్ సింగ్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ చేసిన సినిమా కావడంతో అప్పట్లో ఈ సినిమా పై అంచనాలు మామూలు రేంజ్ లో ఉండేవి కాదు. పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి కూడా క్లిక్ అవ్వడంతో కనీవినీ ఎరుగని రేంజ్ హైప్ తో ఈ సినిమా విడుదలైంది. కానీ ఎన్టీఆర్ కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ చిత్రం గా నిల్చింది. మొదటి రోజు వచ్చిన భారీ ఓపెనింగ్స్ తప్ప, రెండవ రోజు నుండి చిల్లర వసూళ్లు వచ్చాయి. క్లోజింగ్ లో కనీసం 30 కోట్ల షేర్ కూడా రాలేదు.
అయితే ఈ సినిమా ఫలితం పై దిల్ రాజు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘రామయ్య వస్తావయ్యా సినిమా కి ఫ్లాప్ టాక్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ నన్ను, హరీష్ శంకర్ ని ఇంటికి పిలిచాడు. మధ్యాహ్నం రెండు గంటలకు మేమిద్దరం ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నాము.మూడింటికి మాట్లాడుకునేందుకు కూర్చున్నాము. అప్పటికే మా ముగ్గురికి సినిమా ఫలితం ఏమిటో అర్థం అయిపోయింది. ఎందుకు ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది?, అసలు ఎందుకు ఇలాంటి సినిమాని తీశామని సుమారుగా ఆరు గంటలు చర్చించుకున్నాము. హరీష్ శంకర్ తాను చేసిన పొరపాట్లను గమనించాడు. ఎన్టీఆర్ కూడా మళ్ళీ ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు జాగ్రత్తగా వ్యవహరించాలని హరీష్ కి క్లాస్ పీకాడు. అలా నాలుగు గోడల మధ్య మా చర్చలు ముగిసాయి. ఆ చిత్రం తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం రాలేదు. ఆయనకు చాలా పెద్ద బాకీ పడ్డాను,తీర్చుకోవాలి త్వరలో’ అంటూ చెప్పుకొచ్చాడు దిల్ రాజు.