IND Vs PAK: అబుదాబి వేదికగా భారత్ – పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ గెలవడం పాకిస్తాన్ జట్టుకు అత్యంత అవసరం. ఎందుకంటే ఇటీవల తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ 60 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో పాకిస్తాన్ సెమిస్ వెళ్లాలంటే కచ్చితంగా భారత్ పై గెలవాలి. అందువల్లే కాబోలు పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ టాస్ గెలవ గానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అబుదాబి మైదానం కూడా పాకిస్తాన్ గ్రౌండ్స్ లాగే ఉంటాయని భావించి ఉంటాడు కాబోలు. కానీ టాస్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ జట్టు ఒక్క మూడో వికెట్ మినహా.. ఏ వికెట్ కు కూడా భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేయలేకపోయింది.. భారత బౌలర్ ఎదుట పాకిస్తాన్ బ్యాటర్ల సమూహం సాగిల పడిపోయింది. మూడో వికెట్ కు మహమ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ 104 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తొలి వికెట్ కు బాబర్ అజాం, ఇమామ్ ఉల్ హక్ 41 పరుగుల భాగస్వామ్యం కోల్పారు. ఇక మరే వికెట్ కు కూడా పాకిస్తాన్ ఆటగాళ్లు ఈ తరహాలో భాగస్వామ్యం నెలకొల్పలేదు. బౌలింగ్ సహకరిస్తున్న మైదానంపై భారత బౌలర్లు పదునైన బంతులు వేస్తే.. పరుగులు చేయలేక పాకిస్తాన్ ఆటగాళ్లు చేతులెత్తేశారు.
242 పరుగుల టార్గెట్
అబుదాబి మైదానంపై ముందుగా బౌలింగ్ చేసిన జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే బంతి అనూహ్యంగా టర్న్ అవుతుంది. టాస్ ఓడిపోయిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కడ ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వస్తుందని భయపడ్డాడు. కానీ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో రోహిత్ మనసులో నవ్వుకున్నాడు . ఆ తర్వాత రవి శాస్త్రి అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. ” బౌలింగ్ ముందుగా చేయాల్సి వస్తోంది. దీనికి తగ్గట్టుగా మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. ఖచ్చితమైన బంతులు వేస్తాము. ఈ మైదానంపై గతంలో ఆడిన అనుభవం మాకు ఉంది. ఆ అనుభవం ఇప్పుడు మాకు ఉపయోగపడుతుంది. కచ్చితంగా మా వైపు టర్న్ ఉంటుందని నేను భావిస్తున్నాను. మా బౌలర్లు కూడా రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. కచ్చితంగా వికెట్లు తీస్తారని” పేర్కొన్నాడు.. అతడు చేసిన వ్యాఖ్యలకు తగ్గట్టుగానే టీమిండియా బౌలర్లు బౌలింగ్ చేశారు. బంగ్లాదేశ్ పై ఐదు వికెట్లు తీసిన మహమ్మద్ షమీ.. పాకిస్తాన్ జట్టుపై వికెట్లు తీయలేకపోయినప్పటికీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కులదీప్ యాదవ్ తన మ్యాజికల్ డెలివరీలతో అదరగొట్టాడు. ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు సాధించాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలా ఒక వికెట్ సాధించారు. అబుదాబి మైదానంపై 242 పరుగుల లక్ష్యం చేజింగ్ చేసే జట్టుకు పెద్ద టార్గెట్ కాదని.. క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చేజింగ్ చేసే సమయంలో బౌలింగ్ వేసే జట్టుకు మంచు కురవడం వల్ల ఇబ్బంది ఎదురవుతుందని వారు పేర్కొంటున్నారు. ఇక ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోతే ఇంటికి వెళ్లడమే.. బంగ్లాదేశ్ జట్టుపై పాకిస్తాన్ గెలిచినా పెద్దగా ఉపయోగ ఉండదు..కాగా, 2017లో పాకిస్తాన్ భారత జట్టును ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకున్న విషయం తెలిసిందే.