Producer Dil Raju: దిల్ రాజు టైం బాగుంది. లేదంటే మరో భారీ దెబ్బ తగిలేది. ఆయన జస్ట్ మిస్ అనే వాదన టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఆ స్టోరీ ఏంటో చూద్దాం..
ఈ మధ్య కాలంలో దిల్ రాజు(DIL RAJU)కు వరుస దెబ్బలు తగిలాయి. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా హైయెస్ట్ హిట్ రేట్ ఉన్న దిల్ రాజు తడబడుతున్నాడు. గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం మూవీ నిర్మాణ భాగస్వామిగా మారి పెద్ద మొత్తంలో నష్టపోయాడు. శాకుంతలం సమంత కెరీర్లో భారీ డిజాస్టర్ గా నిలిచింది. తర్వాత ది ఫ్యామిలీ స్టార్ రూపంలో మరో షాక్ తగిలింది. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ ది ఫ్యామిలీ స్టార్ తెరకెక్కించాడు. అల్లు అరవింద్ కి షాక్ ఇచ్చి దిల్ రాజుకు పరశురామ్ మూవీ చేశాడు. అనూహ్యంగా అల్లు అరవింద్ సేవ్ అయ్యాడు, దిల్ రాజు బుక్ అయ్యాడు.
Also Read: అతడు లో ఆ రోల్ ఆ హీరో చేసి ఉంటే, మహేష్ సినిమాను కూడా రిజెక్ట్ చేశాడా!
ఇక గేమ్ ఛేంజర్ దిల్ రాజును కోలుకోలేని దెబ్బ తీసింది. భారతీయుడు 2 చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాల్సింది. శంకర్-దిల్ రాజు ప్రకటన కూడా చేశారు. కారణం తెలియదు కానీ దిల్ రాజు ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. భారతీయుడు 2 డిజాస్టర్ కాగా, లైకా ప్రొడక్షన్స్ నష్టపోయింది. అయినప్పటికీ భారతీయుడు 2 దిల్ రాజును పరోక్షంగా దెబ్బ తీసింది. గేమ్ ఛేంజర్ చిత్రీకరణ దశలో ఉండగా వివాదాలతో మధ్యలో ఆగిపోయిన భారతీయుడు 2ని శంకర్ పూర్తి చేయాల్సి వచ్చింది.
ఏక కాలంలో గేమ్ ఛేంజర్, భారతీయుడు 2 చిత్రాలు తెరకెక్కించిన శంకర్… దేనికీ న్యాయం చేయలేకపోయాడు. దానికి తోడు గేమ్ ఛేంజర్ బడ్జెట్ పెంచేశాడు. మూడేళ్ళ పాటు చిత్రీకరించారు. 2025 సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ ప్లాప్ కావడంతో దిల్ రాజుకు వందల కోట్లలో నష్టం వాటిల్లింది. దిల్ రాజు అయోమయంలో ఉండగా సంక్రాంతికి వస్తున్నాం రక్షించింది. ఆ మూవీ ఎవరూ ఊహించని విధంగా రూ. 300 కోట్లు వసూలు చేయడంతో గేమ్ ఛేంజర్ నష్టాలు దిల్ రాజు పూడ్చుకున్నాడు. కాగా తమ్ముడు రూపంలో దిల్ రాజుకు లేటెస్ట్ షాక్ తగిలింది. ఆ మూవీ కనీస ఆదరణ పొందలేదు.
Also Read: గర్ల్ ఫ్రెండ్ కి టైం ఇవ్వలేదు, నా జీవితం నాకే నచ్చలేదు…
అయితే దిల్ రాజు అతిపెద్ద ప్రమాదం నుండి తప్పుకున్నాడు అనేది తాజా వార్త. హరి హర వీరమల్లు(HARI HARA VEERAMALLU) నైజాం, ఉత్తరాంధ్ర హక్కులను దిల్ రాజు కొనే ప్రయత్నం చేశాడు. దిల్ రాజు ఆ రెండు ఏరియాలను కలిపి రూ. 50 కోట్లకు అడిగాడట. హరి హర వీరమల్లు నిర్మాతలు రూ. 80 కోట్లు డిమాండ్ చేయడంతో వెనక్కి తగ్గాడట. డిజాస్టర్ టాక్ తో హరి హర వీరమల్లు కలెక్షన్స్ రెండో రోజుకే 70-80 శాతం పడిపోయాయి. ఒకవేళ దిల్ రాజు హరి హర వీరమల్లు కొని ఉంటే ఆయనకు కోట్లలో నష్టాలు తప్పేవి కావు.