‘దిల్’ రాజు తమ్ముడు శిరీష్ కుమారుడు ఆశిష్ హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా పేరు ‘రౌడీ బాయ్స్’. సహజంగా వేరే హీరోల కథలపైనే సంవత్సరాలు పాటు వర్క్ చేయించి సినిమాలు తీసే దిల్ రాజు, తన తమ్ముడు కుమారుడి కోసం ఏకంగా మూడు ఏళ్ళు స్క్రిప్ట్ వర్క్ చేయించి ఈ సినిమాని తీసుకువస్తున్నాడు.
అయినా దిల్ రాజుకి ఎక్కడో భయం ఉంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను వీవీ వినాయక్, మోషన్ పోస్టర్‌ను సుకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ ‘‘‘హీరోగా సక్సెస్ కావడం కష్టం. నిజానికి మాకు మంచి అనుభవం ఉంది. అయినా ఎంత జడ్జ్‌మెంట్ ఉన్నప్పటికీ.. మా వాడికి ప్రేక్షకులు పాస్ మార్కులు వేసే వరకు మాకు టెన్షనే. ఆశిష్ విషయంలో చాలా టెన్షన్ పడుతున్నాం’ అని చెప్పుకుకొచ్చారు.
అయితే, దిల్ రాజు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ హీరోగా సక్సెస్ కాలేదు అంటే.. కచ్చితంగా మరో ఆప్షన్ పెట్టుకోవాలని, మరో ఫీల్డ్ కి వెళ్లాలని ఆశిష్ ను ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను’ అంటూ దిల్ రాజు చెప్పాడు. దిల్ రాజు మాటల్లో ఎక్కడో ఈ సినిమా పై అపనమ్మకం కనిపిస్తుంది. సినిమా ఎలా ఉన్నా.. అద్భుతమైన సక్సెస్ ఫుల్ సినిమా తీశానని నిర్మాత చెప్పాలి.
కానీ దిల్ రాజు మాత్రం ఒకవేళ ఫెయిల్ అయితే.. ? అందుకే ఆశిష్ దేనికైనా ప్రిపేర్డ్‌గా ఉండాలి అంటూ ఇన్ డైరెక్ట్ గా సినిమా ఎలా ఉండబోతుందో ‘దిల్’ రాజు చెబుతున్నట్లు ఉంది. మరి ఈ ‘‘రౌడీ బాయ్స్’ హిట్ అవుతుందో లేదో చూడాలి.