Dil Raju Baahubali: తెలుగు సినిమా ఇండస్ట్రీ ని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి (Rajamouli)…ఆయన చేసిన బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారి షాక్ కి గురైంది. బాహుబలి పుణ్యమాని చాలామంది దర్శకులు పాన్ ఇండియా సినిమా చేసి భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే రీసెంట్ గా స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు బాహుబలి(Bahubali) బడ్జెట్ ప్రస్తావన వచ్చింది. అయితే రెండు సినిమాలకు కలిపి దాదాపు 600 కోట్ల వరకు అయ్యాయని దిల్ రాజు చెప్పాడు. ఇక దాంతో పాటుగా బాహుబలి పార్ట్ వన్ ఆశించిన మేరకు ఆడలేదని ఆ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది అంటూనే ఆ మూవీ కొంతవరకు ప్రొడ్యూసర్స్ కి ఇబ్బందిని కలిగించింది అంటూ కామెంట్స్ చేశాడు… కానీ ఈ మూవీ మొదటి పార్ట్ వల్లే రెండో పార్ట్ ను సైతం రిస్క్ చేసి మరీ చేశారు. దానివల్ల రెండో పార్ట్ మంచి విజయాన్ని సాధించింది అంటూ ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బాహుబలి మొదటి పార్ట్ ఆశించిన మేరకు ఆడలేదని దిల్ రాజు చెప్పడంతో అది జస్ట్ యావరేజ్ గా ఆడిందని నష్టాలు వచ్చాయని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించిన వీడియోను ప్రభాస్ అభిమానులు చూస్తూ దిల్ రాజు మీద కొంతవరకు సీరియస్ అవుతున్నారు.బాహుబలి అనేది చాలా ప్రస్టేజియస్ గా కెరకెక్కించిన సినిమా అని దానివల్ల తెలుగు వాళ్ళ ఖ్యాతి పెరిగిందని మనం గర్వపడాలి తప్ప ఆ సినిమా ఎవరికి నష్టాలు మిగిల్చింది.
Also Read: సుకుమార్ వల్లే అల్లు అర్జున్ స్టార్ అయ్యాడు అంటూ రాఘవేంద్ర రావు వివాదాస్పద వ్యాఖ్యలు!
ఎవరికి లాభాలు వచ్చాయి అనేదాని గురించి డిస్కస్ చేయడం సరైన విషయం కాదు అంటూ ప్రభాస్ అభిమానులు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ దిల్ రాజు మీద కొంతవరకు ఫైర్ అవుతున్నారు… ఇక ఏది ఏమైనా కూడా దిల్ రాజు కూడా ఆ వీడియోలో పెద్దగా కామెంట్ చేసింది అయితే ఏమీ లేదు.
సినిమా ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఆయన అలాంటి మాటలు మాట్లాడాడని దానివల్ల సినిమాకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఏమీ లేదని ప్రభాస్ ను కించపరిచే విధంగా కూడా తను మాట్లాడలేదు అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు కామెంట్స్ చేస్తుండటం విశేషం… ఈమధ్య దిల్ రాజు ఏది చేసిన అది వైరల్ అవుతుంది… దాంతో గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ తాలూకు వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండటం అనేది ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇక రీసెంట్ గా దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వచ్చిన తమ్ముడు(Thammudu) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అయితే దక్కించుకోలేకపోయింది. ప్రేక్షకులు ఈ సినిమాని చూస్తున్నప్పటికి ఈ సినిమాలో ఎమోషన్ అయితే మిస్సయిందని దిల్ రాజు ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నప్పటికి అది నిరాశను మిగిల్చింది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండటం విశేషం…
