Dil Raju Pawan Kalyan film: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్స్ ను ఛార్జ్ చేస్తున్నారు. దీనివల్ల సినిమా బడ్జెట్స్ సైతం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో సినిమా టిక్కెట్ రేట్లను పెంచుకోవడం తప్ప సినిమా ప్రొడ్యూసర్స్ కి వేరే ఆప్షన్ లేకుండా పోతోంది. అందువల్లే స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయిన వారం, పది రోజుల వరకు టిక్కెట్ రేట్లను భారీగా పెంచుతున్నారు. తద్వారా వాళ్లకు ఎక్కువ అమౌంట్ వచ్చే విధంగా చూసుకుంటున్నారు. దీనివల్ల చిన్న సినిమాలకు కొంతవరకు నష్టం వాటిల్లుతోంది… ఇక ఆడియన్స్ సైతం పెద్ద సినిమాల టిక్కెట్స్ రెట్లు ఎంత పెంచిన వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఇక తెలుగులో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్ ఈయన సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆయనే టిక్కెట్స్ రెట్లు పెంచకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. కావాలంటే ఆయన జేబులో నుంచి ప్రొడ్యూసర్ కి డబ్బులు ఇచ్చిన కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని అనుకుంటాడు. ఇక ఈ క్రమంలోనే ఆయన ఈ సంవత్సరం హరిహర వీరమల్లు, ఓజీ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో హరిహర వీరమల్లు నిరాశపర్చినప్పటికి, ఓజి సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్న దర్శకుడు సుజీత్ ఈ సినిమాని సూపర్ సక్సెస్ గా నిలపడంలో కీలకపాత్ర వహించాడు…
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన మరో రెండు సినిమాలకు కమిట్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికే దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ మూవీ దర్శకుడు ఎవరనే దానిమీదనే సర్వత్రా ఆసక్తి నెలకొంది… రీసెంట్ గా దిల్ రాజు ‘అర్జునా’ అనే ఒక టైటిల్ ని సైతం రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ పవన్ కళ్యాణ్ కోసమే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. నిజానికి దిల్ రాజు, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ‘వకీల్ సాబ్ ‘ అనే ఒక మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ వచ్చింది. ఇక ఇప్పుడు అర్జునా అనే టైటిల్ పవర్ఫుల్ గా ఉంది.
ఇక నిజంగానే దిల్ రాజు పవన్ కళ్యాణ్ కోసమే ఆ టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేయించాడా? లేదంటే ఇతర హీరోలతో చేయడానికి చేశాడా అనేది తెలియాల్సి ఉంది… మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఉంటుంది. కానీ అది ఎప్పుడు ఉంటుంది ఈ సినిమాకి దర్శకత్వం వహించేది ఎవరు అనే విషయాల మీద ఇంకా స్పష్టత రాలేదు. తొందర్లోనే ఈ సినిమాని అనౌన్స్ చేసి ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…