Dil Raju: శాకుంతలం మూవీతో దిల్ రాజుకు భారీ దెబ్బ తగిలిందని ప్రచారం అవుతుంది. దీనిపై ఆయనే స్వయంగా స్పందించారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో శాకుంతలం రిజల్ట్ పై ఓపెన్ అయ్యారు. సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం చిత్రాన్ని తెరకెక్కించారు. పౌరాణిక గాధగా తెరకెక్కిన శాకుంతలం చిత్రాన్ని భారీగా ప్రమోట్ చేశారు. ముంబైలో కూడా ఒకటి రెండు మీట్స్ ఏర్పాటు చేశారు. అయితే శాకుంతలం ట్రైలర్ చూశాక ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది. ఆయన సమంతతో సీరియల్ తీశారా? అంటూ నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.
ప్రేక్షకులు ఊహించిందే జరిగింది. నాసిరకం గ్రాఫిక్స్, సెట్స్… మ్యాజిక్ చేయలేకపోయాయి. దానికి తోడు ఏమాత్రం ఆసక్తి కలిగించని కథనం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. దాంతో మొదటి షో నుండి శాకుంతలం నెగిటివ్ టాక్ అందుకుంది. సాయంత్రానికి శాకుంతలం థియేటర్స్ ఖాళీ. దాదాపు రూ. 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే తెలుగు రాష్ట్రాల్లో కనీసం రూ. 4 కోట్ల షేర్ రాలేదు. సమంత కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. శాకుంతలం మూవీతో దిల్ రాజు బాగా నష్టపోయారని ప్రచారం జరుగుతుంది.
ఈ విషయాన్ని దిల్ రాజు నేరుగా ప్రస్తావించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో 50 సినిమాలు పూర్తయిన సందర్భంగా ఆయన సుదీర్ఘ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాల మీద స్పందించారు. శాకుంతలం తన 25 కెరీర్లో అతి పెద్ద దెబ్బ. అసలు ఊహించలేదని చెప్పారు. జస్ట్ ప్రోమో మాత్రమే విడుదల కాగా… వివరణ ఏమిటో ఫుల్ ఇంటర్వ్యూ విడుదలయ్యాక తెలుస్తుంది.
ఈ ప్రోమోలో దిల్ రాజు… ఎన్టీఆర్, ప్రభాస్ లతో చిత్రాలు చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. వీరిద్దరితో మీకు గ్యాప్ వచ్చింది కదా అని యాంకర్ అడిగారు. వచ్చిన మాట నిజమే కానీ నెక్స్ట్ చేయబోతున్నాను. ఎన్టీఆర్, ప్రభాస్ చిత్రాలు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని దిల్ రాజు అన్నారు. పరిశ్రమలో ఏం జరిగినా నన్ను లాగుతున్నారు. ఫ్రస్ట్రేషన్ లో బరస్ట్ కావాల్సి వస్తుందని దిల్ రాజు అన్నారు. అలాగే రెండో పెళ్లి నిర్ణయం మీద కూడా దిల్ రాజు స్పందించడం విశేషం.