https://oktelugu.com/

బోయపాటిని లైన్లో పెడుతున్న దిల్ రాజు.. కారణమేంటీ?

టాలీవుడ్లోని తెలివైన నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. సినిమా నిర్మాణ విషయంలో దిల్ రాజు ఎంతో ముందుచూపుతో ఆలోచిస్తుంటారు. దర్శకులు, హీరోలకు ముందస్తు అడ్వాన్సులు ఇస్తూ వారిని బుక్ చేసుకుంటూ తన పనిని సులువు చేసుకోవడం దిల్ రాజు అందరి కంటే ముందుంటాడు. సినిమాల జడ్జిమెంట్ విషయంలోనూ దిల్ రాజు నిర్ణయం కరెక్ట్ ఉంటుందనే టాక్ టాలీవుడ్లో ఉంది. Also Read: మెగాస్టార్ ను దాటలేకపోతున్నా ఇప్పటి స్టార్స్ ! కరోనా నేపథ్యంలో సినిమా షూటింగులన్నీ వాయిదాపడ్డాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 16, 2020 / 06:15 PM IST
    Follow us on

    టాలీవుడ్లోని తెలివైన నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. సినిమా నిర్మాణ విషయంలో దిల్ రాజు ఎంతో ముందుచూపుతో ఆలోచిస్తుంటారు. దర్శకులు, హీరోలకు ముందస్తు అడ్వాన్సులు ఇస్తూ వారిని బుక్ చేసుకుంటూ తన పనిని సులువు చేసుకోవడం దిల్ రాజు అందరి కంటే ముందుంటాడు. సినిమాల జడ్జిమెంట్ విషయంలోనూ దిల్ రాజు నిర్ణయం కరెక్ట్ ఉంటుందనే టాక్ టాలీవుడ్లో ఉంది.

    Also Read: మెగాస్టార్ ను దాటలేకపోతున్నా ఇప్పటి స్టార్స్ !

    కరోనా నేపథ్యంలో సినిమా షూటింగులన్నీ వాయిదాపడ్డాయి. దీంతో సినిమా నిర్మాతలు.. దర్మకులు.. హీరోల ప్లాన్స్ అన్నీ తలకిందులైపోయాయి. ప్రస్తుతం దిల్ రాజుకు స్టార్ హీరోల కొరత వచ్చినట్లు కన్పిస్తోంది. మహేష్ బాబు-వంశీపైడిపల్లి కాంబినేషన్లో ఓ మూవీ చేయాలని దిల్ రాజు ప్రయత్నించారు. అయితే వంశీ పైడిపల్లి కథను సిద్ధం చేయడంలో విఫలం అవడంతో మహేష్ దర్శకుడు పర్శురాంతో మూవీకి కమిట్ అయ్యాడు.

    దీంతో మహేష్ తో మూవీని దిల్ రాజు చేజార్చుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా ప్రభాస్ తో ఓ మూవీ చేయాలని భావించాడు. ప్రభాస్ ప్రస్తుతం నాలుగైదు పెద్ద ప్రాజెక్టులకు కమిట్ అయ్యాడు. దీంతో ప్రభాస్ తో మూవీ కూడా కష్టమేనని తేలింది. ఇక రాంచరణ్ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తుండగా.. అల్లు అర్జున్ ‘పుష్ప’లో నటిస్తూ బీజీగా ఉన్నారు. దీంతో వీరిద్దరి డేట్స్ కూడా ఇప్పట్లో వీరితో మూవీ కష్టమేనని తేలిపోయింది.

    ఈనేపథ్యంలో దిల్ రాజు దర్శకుడు బోయపాటిని లైన్లో పెడుతున్నాడు. బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణతో ఓ మూవీ చేస్తున్నాడు. గతంలో బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. దీంతో ఈ మూవీ కూడా హిట్టవుతుందని దిల్ రాజు భావిస్తున్నారు.
    ఈ సినిమాతో బోయపాటి మార్కెట్ మళ్లీ పెరుగుతుందని దిల్ రాజు అంచనా వేస్తున్నాడు.

    Also Read: ‘దిల్ రాజు’ను ఇబ్బంది పెడుతున్న ‘వకీల్ సాబ్’ !

    దీంతోనే అతడికి ముందస్తు అడ్వాన్స్ చెల్లించి బుకింగ్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ దర్శకుడితో సినిమా చేసే హీరో దిల్ రాజుతో చేయాల్సిందే. అందుకే దిల్ రాజు హీరోల డేట్స్ కోసం దర్శకుడిని లైన్లో పెట్టే పనిలో పడ్డాడు. ఇది తెలివైన నిర్ణయమే అయినా దిల్ రాజుకు ఏమేరకు కలిసిస్తుందనేది మాత్రం వేచిచూడాల్సిందే..!