Dil Raju – Vijay Deverakonda: తెలుగు సినిమాకు సంక్రాంతి గోల్డెన్ సీజన్. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వర్షం కురుస్తుంది. ఇక హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ సినిమాను ఆపడం కష్టమే. సంక్రాంతి వేదికగా వందల సంఖ్యలో ఇండస్ట్రీ హిట్స్ పడ్డాయి. పెద్ద పండుగ మూడు రోజుల్లో ఒక రోజు ఇంటిల్లిపాది సినిమాకి వెళ్లడం ఆనవాయితీ. అందుకే నిర్మాతల మధ్య సంక్రాంతి సీజన్ విషయంలో పోటీ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ మీద ఆధిపత్యం సాధించి కింగ్ మేకర్ అయిన దిల్ రాజు ప్రతి సంక్రాంతిని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఆయన బ్యానర్లో తెరకెక్కిన సినిమా ఉన్నా లేకున్నా… హక్కులు కొనడం లేదా డబ్బింగ్ చిత్రాల లైన్లో పెట్టడం ద్వారా సంక్రాంతి బరిలో నిల్చుంటున్నారు. ఆయన సినిమా ఉందంటే మెజారిటీ థియేటర్స్ ఆ మూవీకే దక్కుతాయి. దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ తన ఆధీనంలోకి తీసుకుని తన సినిమాలను ఆడించుకుంటున్నాడనేది ఆరోపణ. 2021 సంక్రాంతి కి క్రాక్ విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.
డబ్బింగ్ మూవీ మాస్టర్ విడుదల చేసిన దిల్ రాజు క్రాక్ కి మేజర్ రెవెన్యూ వచ్చే థియేటర్స్ దక్కకుండా చేశాడు. ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఆరోపణలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అంతకు ముందు 2020 సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్ర డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు అల వైకుంఠపురంలో నిర్మాతలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు ఈ రెండు చిత్రాల నిర్మాతల మధ్య థియేటర్స్ విషయంలో వివాదం తలెత్తింది.
2022లో కరోనా ఆంక్షల నేపథ్యంలో పెద్ద సినిమాలు విడుదల కాలేదు. ఎలాంటి గొడవలు జరగలేదు. ఇక 2023 సంక్రాంతి సీజన్ కి ఎంత పెద్ద రచ్చ అయిందో తెలిసిందే. వారసుడు చిత్ర నిర్మాతగా ఉన్న దిల్ రాజు మెజారిటీ థియేటర్స్ ఆ చిత్రానికి బ్లాక్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు థియేటర్స్ దక్కని పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదంలో దిల్ రాజే నష్టపోయాడు. వారసుడు విడుదల జనవరి 14కి వెళ్ళింది. ముందుగా అనుకున్నట్లు 11న విడుదల చేస్తే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు థియేటర్స్ దొరికేవి కావు.
కాగా 2024లో కూడా దిల్ రాజు తరహా థియేటర్ పాలిటిక్స్ తప్పేలా లేదు. నెక్స్ట్ సంక్రాంతికి ఆయన విజయ్ దేవరకొండ సినిమా ప్రకటించారు. దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న VD 13 షూటింగ్ ఇవాళ మొదలైంది. 2024 సంక్రాంతికి విడుదలని ప్రకటించారు. దీంతో ఆల్రెడీ బరిలో ఉన్న గుంటూరు కారం, ఈగిల్, ప్రాజెక్ట్ కే నిర్మాతలు బెంబేలెత్తుతున్నారు. మళ్ళీ దిల్ రాజుతో తిప్పలు తప్పవని తల బాదుకుంటున్నారు.
The shoot of our #VD13 #SVC54 kick started today!
Promising you a perfect entertainer for Sankranthi 2024.❤️@TheDeverakonda #MrunalThakur @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official pic.twitter.com/wEBkpqDROv
— Sri Venkateswara Creations (@SVC_official) July 15, 2023