https://oktelugu.com/

Dil Raju : ఫేడ్ అవుట్ అయిపోయిన డైరెక్టర్ తో దిల్ రాజు సినిమా..మరో సరికొత్త ప్రయోగం..ఈసారి మిస్ అయితే అవుట్!

Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) సంగతి మన అందరికీ తెలిసిందే. చాలా జాగ్రత్తగా, హెచ్చులకు పోకుండా, కొత్త డైరెక్టర్స్ తో మినిమం గ్యారంటీ సినిమాలను నిర్మిస్తూ స్టార్ నిర్మాతగా ఇండస్ట్రీ లో ఎదిగాడు.

Written By: , Updated On : February 27, 2025 / 05:27 PM IST
Dil Raju

Dil Raju

Follow us on

Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) సంగతి మన అందరికీ తెలిసిందే. చాలా జాగ్రత్తగా, హెచ్చులకు పోకుండా, కొత్త డైరెక్టర్స్ తో మినిమం గ్యారంటీ సినిమాలను నిర్మిస్తూ స్టార్ నిర్మాతగా ఇండస్ట్రీ లో ఎదిగాడు. అయితే కెరీర్ లో తన పాలసీ ని పక్కన పెట్టి మొట్టమొదటిసారిగా ‘గేమ్ చెంజర్'(Game Changer Movie) అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని చేసాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా దిల్ రాజు కి చుక్కలు చూపించింది. సేఫ్ సైడ్ లో సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని పెట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే దిల్ రాజు ఇండస్ట్రీ లో కనిపించకుండా పోయేవాడిని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. ‘గేమ్ చేంజర్’ అనుభవం తో ఇక మీదట రిస్కులు చేయకుండా, తాను నమ్మిన పాత ఫార్ములా నే అనుసరించబోతున్నాడు. అందులో భాగంగా ‘తొలిప్రేమ’ డైరెక్టర్ కరుణాకరన్(Director Karunakaran) తో త్వరలోనే ఒక సినిమాని సెట్స్ మీదకు తీసుకు రాబోతున్నాడని లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.

Also Read : ఐటీ అధికారుల ముందు మరోసారి హాజరైన నిర్మాత దిల్ రాజు..మళ్ళీ చిక్కుల్లో పడనున్నాడా?

ఒకప్పుడు కరుణాకరన్ అంటే ఒక బ్రాండ్. ఆయన తీసే లవ్ స్టోరీస్ కి కల్ట్ క్లాసిక్స్ స్టేటస్ లు కూడా దక్కాయి. అప్పటి తరం ఆడియన్స్ కి తొలిప్రేమ చిత్రం ఆల్ టైం ఫేవరెట్ అయితే, ఈ తరం యూత్ ఆడియన్స్ కి ‘డార్లింగ్’ సినిమా అలాంటిది అన్నమాట. అయితే డార్లింగ్ తర్వాత ఈ డైరెక్టర్ కెరీర్ లో ఒక్క సూపర్ హిట్ కూడా లేదు. కాస్త గ్యాప్ తీసుకొని సాయి ధరమ్ తేజ్ తో చేసిన ‘తేజ్ – ఐ లవ్ యు’ చిత్రం కూడా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇక ఆ తర్వాత కరుణాకరన్ ఇండస్ట్రీ లో కనిపించకుండా పోయాడు. ఇప్పుడు దిల్ రాజు మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే తన సోదరుడి కుమారుడు ఆశిష్ కోసం కరుణాకరన్ ఒక స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడట.

కథ చాలా బాగా రావడంతో ఆ సినిమాని ఆశిష్ తో చేయాలనీ దిల్ రాజు కోరాడట. కరుణాకరన్ కూడా కాదు అనలేక ఒప్ప్పెసుకున్నాడు. ఏప్రిల్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం కరుణాకరన్ కి అత్యంత కీలకం అదే విధంగా ఆశిష్ కి కూడా ఈ సినిమా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పటి వరకు ఇతను చేసిన సినిమాలు ఒక్కటి కూడా హిట్ కాలేదు. ఇకపోతే ఆశిష్ హీరో గా ‘సెల్ఫిష్’ అనే సినిమా మొదలై చాలా కాలం అయ్యింది. సగం సినిమా పూర్తి అయ్యాక, సుకుమార్ కి ఎందుకో ఈ కథలో కొన్ని రీపైర్లు చేయాలనీ అనిపించిందట. పుష్ప 2 తర్వాత చేస్తానని మాటిచ్చాడు, ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం ఆయన ఆ పనుల్లోనే ఉన్నాడట. సుకుమార్ రైటింగ్స్ కంపెనీ కూడా ఈ సినిమా నిర్మాణం లో పాలుపంచుకుంటుంది.

Also Read : ఆరోజు ఎన్టీఆర్ ఇంటికి పిలిచి 6 గంటలు నాన్ స్టాప్ గా కోటింగ్ ఇచ్చాడంటూ దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!