Dil Raju: ఒక సినిమా తెరమీదికి రావాలంటే దాని వెనకాల చాలామంది కష్టపడాల్సి ఉంటుంది. ఒక దర్శకుడు ప్రొడ్యూసర్ ఇద్దరు కలిసి ఆ సినిమాను సెట్స్ మీదకి తీసుకువస్తారు. కాబట్టి సినిమాకి వీళ్లిద్దరు చాలా కీలకమనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రొడ్యూసర్ దిల్ రాజు సైతం వరుస సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు. నిజానికి ఇండస్ట్రీలో సక్సెస్ లు చాలా తక్కువగా వస్తాయి. కానీ దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు మాత్రం 95% సక్సెస్ రేట్ ని కలిగి ఉన్నాయి అంటే ఆయన స్క్రిప్ట్ విషయంలో గాని, సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లడంలో గాని ఎంత జాగ్రత్తగా ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి సుకుమార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోతున్నాయి.
గత సంవత్సరం వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా భారీగా డీలా పడిపోయిందనే చెప్పాలి. ఇక ఇప్పటికే వాళ్ళ బ్యానర్ నుంచి 50 సినిమాలకు పైన మూవీస్ ని రిలీజ్ చేశాడు.
అయినప్పటికి తన కెరియర్ లో చేసిన సినిమాలన్నింటిలో ఒక మూడు సినిమాలు ఎవరు గ్రీన్ గా నిలిచిపోతాయి అంటూ దిల్ రాజు ఎప్పటికి చెబుతుంటాడు. అందులో ఒకటి ‘బొమ్మరిల్లు’ సినిమా కాగా, మరొకటి ‘కొత్త బంగారు లోకం’ ఇంకొకటి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా కావడం విశేషం… ఈ మూడు సినిమాలకి చాలా మంచి ప్రత్యేకత ఉంది.
ఇప్పటికి జనాలు ఆ సినిమాలను టీవీల్లో చూస్తూ ఉంటారని దిల్ రాజు పాలు సందర్భాల్లో చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా దిల్ రాజు బ్యానర్ ని నిలబెట్టిన సినిమాల్లో ఈ మూడు సినిమాలు మొదటి వరుసలో ఉంటాయి… ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ కి వాల్యూస్ ఇస్తూ ఆయన చిత్రీకరించే సినిమాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నాయి…