https://oktelugu.com/

Game Changer Movie : గేమ్ చేంజర్’ చిత్రంపై దిల్ రాజుకి నమ్మకం లేదా..? అందుకే ఎన్నడూ చేయని రిస్క్ చేయబోతున్నాడా!

దిల్ రాజు, రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' చిత్రానికి డబ్బులు మంచి నీళ్లు లాగా ఖర్చు చేసాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులు మొత్తం ఈ సినిమా కోసమే ఖర్చు చేసాడట.

Written By:
  • Vicky
  • , Updated On : November 2, 2024 / 10:10 PM IST

    Game Changer Movie

    Follow us on

    Game Changer Movie :  తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తమకంటూ ఒక బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకున్న నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. కేవలం ఒక నిర్మాతగా మాత్రమే కాకుండా, డిస్ట్రిబ్యూటర్ గా కూడా దిల్ రాజు కింగ్ అనిపించుకున్నాడు. అయితే కరోనా లాక్ డౌన్ తర్వాత ఈయనకి నిర్మాతగా హిట్లు రెండు మూడు తప్ప, మిగిలిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. ప్రస్తుతం ఆయనకు అర్జెంటు గా ఒక హిట్ కావాలి. బడ్జెట్ మించకుండా, చాలా జాగ్రత్తగా సినిమాలు చేసే దిల్ రాజు, రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రానికి డబ్బులు మంచి నీళ్లు లాగా ఖర్చు చేసాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులు మొత్తం ఈ సినిమా కోసమే ఖర్చు చేసాడట.

    కేవలం పాటలకు పెట్టిన బడ్జెట్ 120 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. ఇక సినిమా కోసం ఎంత ఖర్చు చేసి ఉంటాడో మీ ఊహలకే వదిలేస్తున్నాం. అందుకే ఈ సినిమాని ఆయన సేఫ్ గా సంక్రాంతికి విడుదల చేసుకుంటున్నాడు. అయితే ఈ సినిమాతో పాటు దిల్ రాజు విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాని తెరకెక్కించాడు. దీనిని కూడా ఆయన ‘గేమ్ చెంజర్’ చిత్రంతో పాటు విడుదల చేస్తున్నాడు. ‘గేమ్ చేంజర్’ జనవరి 10వ తారీఖున విడుదల అవుతుంటే, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని జనవరి 14 న విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు దిల్ రాజు. 500 కోట్ల రూపాయిలను ఖర్చు చేసి తెరకెక్కించిన ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని ఏ నిర్మాత అయిన సేఫ్ గా, సోలో గా విడుదల చేయలని అనుకుంటాడు. కానీ ఇక్కడ దిల్ రాజు మాత్రం తన సినిమాకి తన సినిమానే పోటీకి దింపుతున్నాడు.

    దీని అర్థం ఏమిటి?, ‘గేమ్ చేంజర్’ పై దిల్ రాజుకి నమ్మకం లేదా?, ఒక సినిమా ఫ్లాప్ అయినా, మరో సినిమాతో సేఫ్ అవ్వొచ్చు అనే ఫార్ములా ని అనుసరిస్తున్నాడా?, అసలు ఆయన మనసులో ఉన్న మాటేంటి అని అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. ఇప్పటి వరకు ‘గేమ్ చేంజర్’ నుండి విడుదలైన పాటలకు, పోస్టర్లకు ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 9వ తారీఖున టీజర్ ని విడుదల చేయబోతున్నారు మూవీ టీం. వచ్చే నెల మొత్తం ప్రొమోషన్స్ లో పాల్గొనడానికి రామ్ చరణ్, శంకర్ రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారు. ప్లానింగ్ మొత్తం భారీగానే ఉంది కానీ, తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా తన సినిమాకి తన సినిమానే పోటీగా దింపే ప్రయోగం చేస్తుండడమే కాస్త అనుమానాలకు దారి తీస్తుంది. ఇది ఇలా ఉండగా 9వ తేదీ విడుదల అవ్వబోయే టీజర్, రామ్ చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ గా ఉండబోతుందట, సినిమా మీద అంచనాలను పదింతలు పెంచేలా ఆ టీజర్ ఉంటుందట.