Sankranthiki Vastunnam: ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద గణనీయమైన వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతూనే ఉంది. నాల్గవ వారం లో ఈ చిత్రానికి నాలుగు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వారం ‘తండేల్’ చిత్రం విడుదలై సూపర్ హిట్ టాక్ రావడం వల్ల ఆడియన్స్ ఆ చిత్రం మొదటి ఛాయస్ గా మారిపోయింది. లేదంటే ఇప్పటికీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రమే ఆడియన్స్ కి మొదటి ఛాయస్ గా ఉండేది అంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు చేసిన ఒక చిన్న పొరపాటు కారణంగా ఈ సినిమాకి 5 కోట్ల రూపాయిలు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు.
ఎందకంటే ఈ చిత్రం ఇంత పెద్ద కమర్షియల్ సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటి ‘గోదారి గట్టు మీద’ పాట. రమణ గోగుల పాడిన ఈ లిరికల్ వీడియో సాంగ్ కి దాదాపుగా 174 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కేవలం ఈ ఒక్క పాట కోసం థియేటర్స్ కి వెళ్లి చూసే ఆడియన్స్ సంఖ్య చాలా పెద్దదే. అలాంటి వీడియో సాంగ్ ని నిన్న విడుదల చేసేసారు. అది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టే ఆదివారం లాంటి రోజున విడుదల చేయడం గమనార్హం. ఈ పాట ని ఇంకా రెండు వారాలు ఆగి విడుదల చేసుంటే బాగుండేది అని అభిమానుల అభిప్రాయం. కేవలం ఈ పాట విడుదల కారణంగా ఫుల్ రన్ లో మరో 5 కోట్ల రూపాయిలు రాబట్టాల్సిన ఈ సినిమా, కేవలం రెండు కోట్ల వద్దనే ఆగిపోయే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ 27 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్ల విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఈ చిత్రానికి 280 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తుంది. కానీ నిర్మాతలు ఇప్పటికే 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు పోస్టర్స్ విడుదల చేసారు. ఇలాంటి పోస్టర్స్ పై మొదటి నుండి కాంట్రవర్సీ నడుస్తూనే ఉంటుంది. ప్రతీ సినిమాకు ప్రొమోషన్స్ కి ఇలాంటి పోస్టర్స్ ఒక పబ్లిసిటీ మెటీరియల్ లాగా మారిపోయింది , వీటిని ఎవ్వరూ అదుపు చేయలేరు, అదంతా బిజినెస్ లో భాగం అనుకోవాల్సిందే. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వసూళ్ల పోస్టర్స్ నిజం కాకపోయినా, ఫుల్ రన్ ముగిసే సమయానికి ఈ చిత్రానికి 290 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఇప్పటికే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది ఈ చిత్రం.