Dil Raju : ఎప్పుడూ ఇంటర్వ్యూస్ ఇవ్వని దిల్ రాజు(Dil Raju) సోదరుడు శిరీష్(Shirish), నిన్న ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా హీరో రామ్ చరణ్(Global star Ram Charan) పై ఆయన చేసిన కామెంట్స్ ని అభిమానులు అసలు తీసుకోలేకపోతున్నారు. అసలే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మిస్ ఫైర్ అయ్యింది, మా హీరో విలువైన సమయం పోయింది,వీళ్లకు సంక్రాంతికి ఒక్క పైసా నష్టం జరగలేదు, అయినప్పటికి రామ్ చరణ్ ని లాగి ఎదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు అంటూ మండిపడ్డారు. అయితే ఈరోజు దిల్ రాజు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన సోదరుడు చేసిన కామెంట్స్ కి వివరణ ఇచ్చాడు. ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం.
యాంకర్ ప్రశ్న అడుగుతూ ‘గేమ్ చేంజర్’ సినిమా విడుదల తర్వాత రామ్ చరణ్ కానీ, శంకర్ కానీ మా గురించి కనీసం ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని కూడా పట్టించుకోలేదు అని మీ సోదరుడు శిరీష్ నిన్న ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. దీనిపై మీ కామెంట్ ఏమిటి?’ అని అడగ్గా, దానికి దిల్ రాజు సమాధానం చెప్తూ ‘గడిచిన పది రోజుల నుండి ప్రతీ ఒక్క ఇంటర్వ్యూ లో గేమ్ చేంజర్ ప్రస్తావన లేకుండా ఇంటర్వ్యూ జరగడం లేదు. నేను మొదటి నుండి చెప్పుకుంటూనే వస్తున్నాను, గేమ్ చేంజర్ విషయం లో నేను ఒక్కడినే రామ్ చరణ్ , శంకర్ లతో చాలా క్లోజ్ గా ట్రావెల్ అయ్యాను. శిరీష్ గారికి ఆ సినిమాలో వేలు పెట్టలేదు. ఆయన ఎక్కువగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మీద ఫోకస్ పెట్టాడు. ‘గేమ్ చేంజర్’ గురించి నేను మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాను. రామ్ చరణ్ మీద నేనెప్పుడూ బ్లేమ్ వెయ్యలేదు’.
‘#RRR వంటి సంచలన విజయం తర్వాత రామ్ చరణ్ గారు మా బ్యానర్ కి డేట్స్ ఇచ్చాడు. అన్ని అనుకున్నట్టు జరిగి ఉండుంటే ఈ ఏడాది లోనే ‘గేమ్ చేంజర్’ పూర్తి అయ్యేది. కానీ మధ్యలో శంకర్ గారు ఇండియన్ 2 కి షిఫ్ట్ అవ్వడం వల్ల రామ్ చరణ్ తో నేను చెప్పాను, వేరే స్క్రిప్ట్ ఏదైనా ఉంటే చేసుకోమని. కానీ ఆయన నా మీద,శంకర్ గారి మీద గౌరవంతో ఏ సినిమా చేయకుండా, పూర్తిగా దీనిపైనే ఫోకస్ పెట్టాడు. నాకు ఒక బాధ ఉండేది నా హీరో ని సైలెంట్ గా ఒక సినిమాకే కూర్చోబెట్టేసాను. శంకర్ గారు ఇండియన్ 2 చేస్తున్నాడు, నేను వేరే సినిమాలు సమాంతరంగా చేస్తున్నాను. ఆరోజు చిరంజీవి , రామ్ చరణ్ గార్లు ‘గేమ్ చేంజర్’ తో పాటు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం విడుదల చేయడానికి ఒప్పుకొని ఉండకపోయుంటే మా పరిస్థితి ఎలా ఉండేది?, రామ్ చరణ్ వల్లనే సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు దిల్ రాజు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి.
Dil Raju steps in for damage control after producer Shirish Reddy’s comments in a recent interview stirred controversy.#GameChanger #RamCharan pic.twitter.com/OEGoApRF0E
— Telugu Chitraalu (@TeluguChitraalu) July 1, 2025