Pawan Kalyan Dil Raju: టాలీవుడ్ లో దాదాపు అందరు అగ్రహీరోలతో సినిమాలు నిర్మించాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. ఒక్క పవన్ తో మాత్రం అతడి కోరిక నెరవేరడానికి చాలా టైం పట్టింది. ‘వకీల్ సాబ్’ మూవీతో పవన్ తో సినిమా కోరికను తీర్చుకున్నాడు దిల్ రాజు. ఆ సినిమాకు దాదాపు 75 కోట్లకు పైగా ఖర్చు పెట్టాడు. పవన్ సినిమాకు అత్యధిక బడ్జెట్ అయ్యింది ఈ సినిమాకే. పవన్ నమ్మి పెట్టుబడి పెట్టిన దిల్ రాజ్ కు అన్ని కలెక్షన్లు వచ్చాయి.

పైగా అది కరోనా సీజన్. అంతటి క్లిష్ట సమయంలోనూ దిల్ రాజ్ సాహసమే చేశాడని చెప్పాలి. దాదాపు డబ్బులు రికవరీ చేశాడని పేరుంది. ఒక సినిమాను చూసి దాని సత్తా ఏంటో సరిగ్గా అంచనావేసి మరీ సరైన రేటు పెట్టి కొని డిస్టిబ్యూట్ చేసే నిర్మాత దిల్ రాజు.. తను తీసే సినిమాల్లో ఇంకా ఎంత పర్ ఫెక్ట్ గా ఉంటాడో అర్థం చేసుకోవచ్చు.
దాదాపు తెలంగాణ విస్తరించి ఉండే నైజాంలో ఏ పెద్ద సినిమా అయినా సరాసరిగా 30 కోట్లకు కొంటుంటారు. కానీ బాహుబలిని ఏకంగా రూ.50 కోట్లు పెట్టి కొని అందరికీ షాకిచ్చాడు దిల్ రాజు. ఆ డబ్బులను వెనక్కి తీసుకొచ్చాడు. బాహుబలితో దిల్ రాజు భారీ లాభాలు చవిచూడాడని పేరుంది. ఇప్పుడు నైజాంలోనూ అంత పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు వెనుకాడకుండా దిల్ రాజు చేశాడు.
బాహుబలి రేంజ్ లో సగం కూడా లేని పవన్ కళ్యాణ్ తాజాగా మూవీ ‘భీమ్లా నాయక్’ కోసం ఇప్పుడు నిర్మాత దిల్ రాజు సాహసం చేస్తున్నాడట.. కేవలం పవన్ మేనియా, పాపులారిటీని నమ్ముకొని ‘భీమ్లా నాయక్’ నైజాం హక్కుల కోసం ఏకంగా రూ.40 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు సమాచారం.
పవన్ కళ్యాణ్ మీద ముందు నుంచి దిల్ రాజుకు ఎప్పుడూ మంచి నమ్మకమే ఉంది. ఆయన సినిమాలు వేటికైనా అంతకుముందు చిత్రాల కంటే ఎక్కువ రేటే పెట్టి హక్కులు తీసుకుంటాడు. మరి భీమ్లా నాయక్ విషయంలో దిల్ రాజు నమ్మకం నెరవేరుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.