Gopichand Ramabanam: హీరో గోపీచంద్ లేటెస్ట్ మూవీ రామబాణం విడుదలకు సిద్ధమైంది. సమ్మర్ కానుకగా మే 5న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో గోపీచంద్ సెన్సేషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయనకు ఫస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ తేజ ఎన్కౌంటర్ చేశారు. కొన్ని సంచలన విషయాలు తెరపైకి తెచ్చి నిలదీశాడు. దర్శకుడు శ్రీవాస్ తో నీకు గొడవలు అయ్యాయట కదా అనగా గోపీచంద్ ఒప్పుకున్నారు. రామబాణం సినిమాను బాలయ్యతో ప్రకటించారు. నెక్స్ట్ నువ్వు తెరపైకి వచ్చావు. ఆయనతో ప్రాజెక్ట్ ఎందుకు పట్టాలెక్కలేదని తేజ అడిగారు. దానికి గోపీచంద్ సమాధానం చెప్పారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో నాకు తెలిసిన సమాచారం ఏంటంటే డైరెక్టర్ తో నీకు గొడవలు జరిగాయని… అని గోపీచంద్ ని తేజ అడిగారు. లెన్త్ లు ఎక్కువైపోతున్నాయి. సినిమా రిజల్ట్ మనకు అర్థమైపోతుంది. గతంలో ఇలాంటివి జరిగాయి. అందుకే శ్రీవాస్ తో గొడవలు అని గోపీచంద్ చెప్పారు. గోపీచంద్-దర్శకుడు తేజ ఇంటర్వ్యూ ప్రోమో మాత్రమే విడుదల చేశారు పూర్తి ఇంటర్వ్యూ రేపు అందుబాటులోకి రానుంది. అప్పుడు అసలు విషయాలు బయటకు రానున్నాయి.
దర్శకుడు శ్రీవాస్ తో గోపీచంద్ కి ఇది హ్యాట్రిక్ మూవీ. శ్రీవాస్ డెబ్యూ మూవీ లక్ష్యం గోపీచంద్ తో చేశారు. లక్ష్యం సూపర్ హిట్ కొట్టింది. నెక్స్ట్ చేసిన శౌర్యం పర్లేదు అనిపించింది. శ్రీవాస్ ఫార్మ్ లో లేరు. ఆయన గత చిత్రం సాక్ష్యం డబుల్ డిజాస్టర్. అదే సమయంలో గోపీచంద్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. ఆయన హిట్టు మొహం చూసి ఏళ్లు గడిచిపోతుంది. ఈ క్రమంలో కలిసొచ్చిన కాంబినేషన్ గా కలిసి మూవీ చేస్తున్నారు.
రామబాణం మూవీలో డింపుల్ హయాతీ హీరోయిన్ గా నటించారు. జగపతిబాబు, కుష్బూ వంటి స్టార్ క్యాస్ట్ నటించారు. భారీ బడ్జెట్ తో ఉన్నతంగా నిర్మించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అలీ, వెన్నెల కిషోర్, సప్తరిగి, సత్య, గెటప్ శ్రీను, నాజర్, సచిన్ ఖేడేకర్ ఇతర కీలక రోల్స్ చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.
https://twitter.com/shreyasgroup/status/1650791474097950721