Ala Vaikunthapurramuloo: ‘అలా వైకుంఠపురంలో’ నటించిన జయరాం అంటే ఎవరో తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరేమో, ఎందుకంటే ఈమధ్య కాలం లో ఈయన ప్రతీ తెలుగు సినిమాలో కనిపిస్తున్నాడు. ఈయన పేరు మన ఆడియన్స్ కి పెద్దగా తెలియకపోవచ్చు కానీ, ముఖాన్ని చూస్తే చిన్న పిల్లవాడు కూడా గుర్తుపట్టగలడు. టాలీవుడ్ లో ఈయన క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తుండొచ్చు కానీ, మలయాళం లో ఈయన టాప్ స్టార్ హీరోలలో ఒకరు. రీసెంట్ గానే ఆయన ‘ఓజ్లర్’ అనే చిత్రంలో హీరోగా నటించి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని కూడా అందుకున్నాడు. 1988 వ సంవత్సరం లో ‘ఆపరన్’ అనే మలయాళం సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలిసినిమానే భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం తో, అదే ఏడాది ఆయనకీ మరో 5 సినిమాల్లో హీరో గా నటించే అవకాశం దక్కింది. ఆ ఏడాది ఆయన చేసిన ఆరు సినిమాలు కమర్షియల్ గా పెద్ద హిట్స్ అయ్యాయి.
ఇక ఆ తర్వాత జయరాం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఏడాదికి ఈయన నుండి 15 , 20 సినిమాలు కూడా విడుదలైన రోజులు ఉండేవి. అప్పట్లో మన తెలుగులో కృష్ణ, చిరంజీవి లాంటి స్టార్స్ ఇలా చేస్తుండేవారు. అలా సుమారుగా ఆయన తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషలకు కలిపి 500 కి పైగా సినిమాల్లో నటించాడు. తెలుగు లో ఈయన 2018 వ సంవత్సరం లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ‘భాగమతి’ చిత్రం ద్వారా నెగటివ్ రోల్ తో మన ఆడియన్స్ కి పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఈయన ‘అలా వైకుంఠపురంలో’, ‘రాధే శ్యామ్’,’ధమాకా’, ‘రావణాసుర’, ‘ఖుషి’, ‘హాయ్ నాన్న’, ‘గుంటూరు కారం’ వంటి చిత్రాల్లో నటించాడు. త్వరలోనే ఈయన నటించిన ‘గేమ్ చేంజర్’, ‘హరి హర వీరమల్లు’ చిత్రాలు కూడా విడుదల కాబోతున్నాయి. అంతే కాకుండా ఇతనికి నాలుగు ఫిలిం ఫేర్ అవార్డ్స్, రెండు కేరళ స్టేట్ అవార్డ్స్, ఒక సైమా అవార్డు తో పాటు ఇంకా ఎన్నో అత్యున్నత పురస్కారాలు ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే జయరామ్ భార్య కూడా సినీ ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ హీరోయిన్. ఆమెపేరు పార్వతి జయరాం. మలయాళం సినీ ఇండస్ట్రీ లో ఈమెకు ఉన్న డిమాండ్ మామూలుది కాదు. అప్పట్లో కేవలం ఈమెని చూసి థియేటర్స్ కి కదిలి వెళ్లే వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటుంది. అయితే జయరాం ని ప్రేమించి పెళ్లాడిన తర్వాత ఈమె సినిమాలకు దూరమైంది. 1986 వ సంవత్సరం లో ఈమె ‘వివాహితరే ఇతిహిలే’ అనే మలయాళం సినిమాతో హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేయగా, 1993 వ సంవత్సరం లో విడుదలైన ‘చెంకోల్’ అనే చిత్రంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. కేవలం 9 ఏళ్లలో ఈమె 70 కి పైగా చిత్రాల్లో నటించింది. దీనిని బట్టి అప్పట్లో ఈమె ఎంత క్రేజీ హీరోయిన్ అనేది అర్థం చేసుకోవచ్చు. తన భర్త జయరాం తో కలిసి 10 కి పైగా చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.