Vijay Sethupathi: తమిళంతోపాటు హిందీ, కన్నడ, మలయాళం, తెలుగు భాషా ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. ఓ వైపు హీరోగా.. మరోవైపు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న మక్కల్ సెల్వన్ ముందుగా వచ్చిన అప్‌డేట్ ప్రకారం కొత్త సినిమా ఫస్ట్ లుక్‌తో అందరినీ పలుకరించాడు.
అగ్ర హీరోల లిస్ట్ లో పేరు సంపాదించి.. దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించాడు విజయ్. రీసెంట్ గా వచ్చిన జవాన్ సినిమాలో విలన్ పాత్రను పోషించి సూపర్ యాక్టర్ అని మరోసారి ప్రూఫ్ చేసుకున్నారు ఈ కోలివుడ్ స్టార్ హీరో. అయితే ఈ స్థాయికి రావాలంలే ఎన్నో కష్టాలను అదిగమించాల్సిందే. పరాజయాలు సైతం పలకరిస్తాయి. అయినా నిలబడి తన జర్నీని సాగించాడు ఈ హీరోవిలన్. ఇండస్ట్రీలోకి ఎవరి సపోర్ట్ లేకుండా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ స్టార్ గురించి కొన్ని ఆసక్తి కర విషయాలు వైరల్ అవుతున్నాయి. ప్రేమ. పెళ్లి, తన జీవితంలోకి వచ్చిన అమ్మాయి గురించి రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు.
అసలు సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు విజయ్ సేతుపతి అకౌంటెంట్ గా పనిచేశారట. నవంబర్ 2000లో, ముంబైలో కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన తర్వాత విజయ్ అకౌంటెంట్‌గా పని చేయడానికి దుబాయ్‌కి వెళ్లాడు. అప్పుడు ఈ స్టార్ హీరో అందుకున్న జీతం కేవలం రూ. 12వేలు. అయితే ఈ నటుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్ లో పని చేస్తున్నప్పుడు తన భార్య జెస్సీ కూడా దుబాయ్ లోనే ఉండేదట. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన జెస్సీ తో చాటింగ్ చేసి ఆ తర్వాత స్నేహం, ప్రేమ మొదలయ్యాయి అని చెప్పుకొచ్చారు విజయ్.
తన భార్య ఎవరో కాదు తన కొలీగ్ స్నేహితురాలు. కానీ ఆన్ లైన్ లోనే చాట్ చేసుకునేవాళ్లట. అయితే నవంబర్ 2003లో, జెస్సీని పెళ్లి చేసుకున్నప్పుడు విజయ్ వయసు 24 సంవత్సరాలు అని తెలిపారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే..వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారట. వీరిద్దరికి కుమారుడు సూర్య, కుమార్తె శ్రీజ సంతానం. విజయ్ సేతుపతి నటించిన సూపర్ డీలక్స్ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నారు. ఇక పెళ్లికి ముందు తన భార్య బాలీవుడ్ హీరో షారుఖ్ అభిమాని అని.. ఇప్పటికీ ఆయనకు వీరాభిమాని అని అన్నారు. భారీగా రెమ్యూనరేషన్ అందుకునే విజయ్ సేతుపతి రీసెంట్ గా వచ్చిన జవాన్ సినిమాలో విలన్ పాత్ర కోసం ఏకంగా రూ. 21 కోట్లు తీసుకున్నారట.