Ileana Mother: టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్లు ప్రస్తుతం సినిమాలు చేస్తున్నా, చేయకపోయినా ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం ని ఏర్పాటు చేసుకొని ఉంటారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు ఇలియానా. హీరో రామ్ మొదటి చిత్రం ‘దేవదాసు’ తో ఈమె కూడా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఇలియానా కి తదుపరి చిత్రం ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేసే అవకాశం దక్కింది. మహేష్ బాబు తో ఆమె కలిసి చేసిన ‘పోకిరి’ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత ఇలియానా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలందరి సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది.
ఆరోజుల్లోనే కోటి రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అతి తక్కువ మంది సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా నిల్చింది ఇలియానా. అలాంటి క్రేజ్ సంపాదించుకున్న ఈమె మధ్యలో బాలీవుడ్ కి వెళ్లి తన కెరీర్ ని నాశనం చేసుకుంది అనే చెప్పాలి. అక్కడ రెండు ఫ్లాప్స్ వచ్చేలోపు ఈమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అదే సమయంలో తెలుగు లో కొత్త హీరోయిన్స్ రాక తో ఇలియానా వైపు చూడడం ఆపేసారు దర్శక నిర్మాతలు. దీంతో అకస్మాత్తుగా ఇండస్ట్రీ నుండి మాయం అయిపోయింది ఇలియానా. ఇదంతా పక్కన పెడితే ఇలియానా తల్లి సమీరా డిక్రూజ్ కూడా ఒక సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించింది అనే విషయం మీకెవరికైనా తెలుసా?..ఇలియానా గతం లో సురేందర్ రెడ్డి, రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘కిక్’ లో హీరోయిన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని సెకండ్ హాఫ్ లో ఒక కామెడీ సన్నివేశం లో సమీరా డిక్రూజ్ కనిపిస్తుంది. ‘జిగురు జింగానీయా’ అంటూ బ్రహ్మానందం ని కలుస్తుంది కదా, ఆమె ఎవరో కాదు ఇలియానా అమ్మ గారే. చిన్న అతిధి పాత్ర లో కనిపించిన ఈమె మళ్ళీ ఎలాంటి సినిమాలోనూ కనిపించలేదు
ఇది ఇలా ఉండగా గతం లో ఇలియానా ఎక్కడికి వెళ్లినా తన అమ్మని వెంట తీసుకొని వెళ్ళేది. అనేక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఈమెని ఇలియానా తో పాటుగా చూడొచ్చు. ఇప్పటికీ కూడా తన అమ్మతో కనెక్షన్ అలాగే మైంటైన్ చేస్తుంది ఇలియానా. ప్రస్తుతం ఒకప్పటి రేంజ్ అవకాశాలతో ఇలియానా బిజీ గా లేకపోయినప్పటికీ అడపాదడపా పలు బాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తూనే ఉంది. ఇవి చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘డో ఔర్ డో ప్యార్’. ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకుంది.