Salaar Child Artist: ప్రభాస్ గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు పాన్ ఇండియా రేంజ్ లో కూడా పరిచయం అవసరం లేదు. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లింది. అయితే ఈ సినిమా తర్వాత ఆశించిన ఫలితాలు లేకపోవడమే కాదు.. ఫ్లాప్ లను రుచి చూశాడు ప్రభాస్. దీంతో ఒక్క హిట్ ఒకే ఒక్క హిట్ కావాలంటూ డార్లింగ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇక రీసెంట్ గా సలార్ సినిమా విడుదలవడం.. హిట్ టాక్ తో దూసుకొని పోవడంతో కాలర్ ఎగిరేసుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు.
ఇదిలా ఉంటే అందరి ఆశలు తగ్గట్టుగానే భారీ అంచనాల నడుమ విడుదలైన సలార్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా డైలాగ్స్, ప్రభాస్ పై ప్రశంసల జల్లు మరింత ఎక్కువ అయింది. ఈ సినిమాలో సలార్ కటౌట్ కు ఫిదా అవ్వని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఇక సినిమాలో స్టోరీ, ప్రభాస్, హీరోయిన్ అందరూ కూడా మెప్పించారు. అంతే కాదు ఓ కుర్రాడు కూడా ఇందులో మంచి మార్కులు వేసుకున్నాడు. మరి ఈయన ఎవరు అనుకుంటున్నారా? ఈయన గురించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.
తాజాగా విడుదలైన సలార్ సినిమాలో పృథ్విరాజ్ చిన్నప్పటి పాత్రలో చేసిన కుర్రాడు నటనకు చాలా మంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఆ కుర్రాడు కూడా మన తెలుగు హీరో కొడుకు అని సమాచారం అందుతోంది. విలన్ పాత్రలో నటించిన పృథ్విరాజ్ చిన్నప్పటి పాత్రలో చేసిన అబ్బాయి పేరు కార్తికేయ దేవ్. ఈయన ఎవరో కాదు టాలీవుడ్ టాప్ హీరో రవితేజ కజిన్ బ్రదర్ కొడుకు అని టాక్. దీని ప్రకారం రవితేజకు కూడా కొడుకు వరుస అవుతారట. ఈయన ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్నారు.
ఈ పాత్ర కోసం ఎంతో మందిని ఆడిషన్స్ కు పిలిచారట. కానీ చివరకు ఆ అదృష్టం మాత్రం కార్తికేయన్ ను వరించింది. ఈ పాత్రలోని సన్నివేశాల కోసం నెల రోజుల పాటు రిహార్సల్స్ పదిహేను రోజుల పాటు షూటింట్ చేశారట. ఈ విషయాన్ని రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో కార్తికేయన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.