Trivikram: మధుబాబు రాసిన ఆ బుక్ నుంచే త్రివిక్రమ్ ఈ సీన్ కాపీ చేశాడా..?

Trivikram: నిజానికి ఈయన సినిమాల్లో ఉండే క్యారెక్టర్లు మన నిజ జీవితంలో చూసిన మనుషులని బేస్ చేసుకొనే ఉంటాయి. ఇక ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో మధుబాబు అనే నవల రచయిత రాసిన కొన్ని నవలల నుంచి కాపీ చేస్తూ ఉండేవాడు.

Written By: Gopi, Updated On : January 19, 2024 2:23 pm
Follow us on

Trivikram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలతో సినిమాలు చేసి టాప్ డైరెక్టర్లు గా నిలిచే దర్శకులు కొందరు మాత్రమే ఉన్నారు. ఇక హీరో ఎవరైనా కూడా వాళ్ళకి సూపర్ సక్సెస్ లను అందించే డైరెక్టర్ ఎవరు అంటే అందరు చెప్పే ఒకే ఒక పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్… ఈయన చేసిన సినిమాలు ఈయనకి మంచి గుర్తింపు సంపాదించి పెట్టడమే కాకుండా ఇండస్ట్రీలో ఈయనని గురూజీ అని పిలుచుకునే అభిమానులను కూడా సంపాదించుకున్నాడు.

నిజానికి ఈయన సినిమాల్లో ఉండే క్యారెక్టర్లు మన నిజ జీవితంలో చూసిన మనుషులని బేస్ చేసుకొనే ఉంటాయి. ఇక ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో మధుబాబు అనే నవల రచయిత రాసిన కొన్ని నవలల నుంచి కాపీ చేస్తూ ఉండేవాడు. ముఖ్యంగా అతడు సినిమా గురించి మనం మాట్లాడుకుంటే ఆ సినిమాలో చిన్నప్పుడు పిల్లవాడు స్మశానంలోకెళ్ళి బాలుడిని తీసుకొచ్చే సీన్ ఒకటి ఉంటుంది.

అది మధు బాబు గారి నవల నుంచి ఆయన పర్మిషన్ తో తీసుకున్నారు. ఇక అలాగే ఆయన రాసిన యముడు అనే బుక్ లో నుంచి అతడు సినిమాలో సునీల్ మహేష్ బాబు ఇద్దరు కలిసి పూజారి ఇంటికి వచ్చి వాళ్ళ పూల కుండి దగ్గర డబ్బులు వేసే సీను మధుబాబు రాసిన యముడు అనే బుక్ లో నుంచి యాస్ ఇట్ ఇస్ గా కొట్టేశాడు. ఇలా త్రివిక్రమ్ మధుబాబు బుక్ లో నుంచి చాలా వరకు లేపేస్తూ ఉంటాడు అని కొంతమంది కామెంట్లుచేస్తూ ఉంటారు. ఇక మరికొంత మంది త్రివిక్రమ్ కాపీ క్యాట్ అంటు విమర్శిస్తూ ఉంటారు. నిజానికి త్రివిక్రమ్ కాపీ చేసిన కూడా ఆ సీన్ కి తగ్గట్టుగా దాన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాడు.

అయినప్పటికీ సినిమాలోని కోర్ సీను ను మాత్రం ఇతరుల దగ్గర నుంచి లేపేస్తూ ఉంటాడు. అందుకే ఆయన మీద ఎక్కువగా కాఫీ ముద్ర పడుతుంది. ఇక ఇప్పటివరకు ఆయన తీసిన ప్రతి సినిమా కూడా కాపీ అంటూ చాలా వార్తలు వచ్చాయి. ఇక ఇది ఇలా ఉంటే రీసెంట్ గా మహేష్ బాబు తో చేసిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా వచ్చి ఫ్లాప్ అయింది. దాంతో ఇప్పుడు అల్లు అర్జున్ తో చేపే సినిమా కోసం ఎలాంటి కథను ఎంచుకుంటున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది…