Sekhar Kammula Tollywood Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళను వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక శేఖర్ కమ్ముల (Shekar Kammula)లాంటి దర్శకుడు సైతం ధనుష్ తో చేసిన కుబేర (Kubera) సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని సాధించాడు. ఇక ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి మంచి వసూళ్లను కలెక్ట్ చేయడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తుందనే చెప్పాలి. శేఖర్ కమ్ముల (Shekar Kammula) మంచి రైటర్ అలాగే మంచి దర్శకుడు కూడా అయినప్పటికి స్టార్ హీరోలెవరు అతనితో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి అయితే చూపించడం లేదు. మొదటి నుంచి ఆయన స్టార్ హీరోలందరికి కథలను చెబుతున్నప్పటికి వాళ్ళందరూ శేఖర్ కమ్ములతో సినిమా చేస్తే తమ మార్కెట్ పడిపోతుందేమో అనే ఉద్దేశ్యంతో ఆయన సినిమాల్లో నటించడం లేదు. నిజానికి ఆయన ఎంచుకునే కథలన్నీ సెన్సిబుల్ సబ్జెక్టులే కావడం విశేషం… నిజానికి స్టార్ హీరోలు కనక ఆయన సినిమాల్లో చేస్తే వాళ్లకు మంచి ఇమేజ్ వస్తుంది. అలాగే ఆ సినిమా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఆయన రాసుకున్న ప్రతి కథను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికి వినిపిస్తూ వస్తున్నాడు.
Also Read: విజయ్ దేవరకొండ పై కేసు నమోదు.. క్షమాపణలు వృధా అయ్యినట్టేనా!
అయినప్పటికి వాళ్ళు మాత్రం అలాంటి సాఫ్ట్ సినిమాలు చేయలేము అంటూ కేవలం మాస్ సినిమాలను మాత్రమే మేము చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఎప్పటికప్పుడు ఆయనకు సమాధానం ఇస్తూ వస్తున్నారు. మరి ఎట్టకేలకు ఆయన ఒక బిచ్చగాడు పాత్ర రాసుకొని ధనుష్ (Dhanush) తో ఆ క్యారెక్టర్ ని చేయించి సూపర్ సక్సెస్ సాధించడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ఇప్పటివరకు ఎవరికీ దక్కనటువంటి అరుదైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న శేఖర్ కమ్ములను ఇకమీదటైన మన స్టార్ హీరోలు గుర్తిస్తారా? ఆయనతో సినిమాలు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. నిజానికి చిన్న కథ, పెద్ద కథ అని ఏది ఉండదు.
మంచి కథ, చెడ్డ కథ మాత్రమే ఉంటాయి. ఇలాంటి సందర్భంలో శేఖర్ కమ్ముల రాసుకున్న పాయింట్లన్నీ యూనిక్ గా ఉంటాయి. కాబట్టి అవి ప్రతి హీరోకి సెట్ అవుతాయి. స్టార్ హీరోలు చేస్తే వాటి స్పాన్ పెరగడమే కాకుండా సినిమా సూపర్ సక్సెస్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇక ఇప్పటికైనా శేఖర్ కమ్ములను పిలిచి మన స్టార్ డైరెక్టర్లు, హీరోలు అవకాశాలు ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…
Also Read: మహేష్ బాబు చేసిన ఆ సూపర్ హిట్ సినిమాలో వాళ్ల అక్క మంజుల నటించాల్సిందా.?