War2 vs Coolie Clash: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చాలా కాలం పాటు సరైన సక్సెస్ లేక డీలా పడిపోయింది. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ ఇద్దరు కలిసి చేస్తున్న వార్ 2 (War 2) సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని అక్కడి అభిమానులతో పాటు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… నిజానికి ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా తెలుగులో మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. మరి అలాంటి సందర్భంలోనే ఈ సినిమా పాన్ ఇండియాలో రికార్డులను బ్రేక్ చేయగలుగుతుందా? ముఖ్యంగా ఈ సినిమాతో పాటు ఆగస్టు 14వ తేదీన రజనీకాంత్ హీరోగా వస్తున్న కూలీ(Cooli) సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఇక ఈ రెండు సినిమాల మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంది. కాబట్టి తెలుగులో మాత్రమే ఈ సినిమాకి మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతోంది. తద్వారా ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక కొద్దిసేపటి క్రితమే వార్ 2 (War 2) సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. హాలీవుడ్ రేంజ్ లో ట్రైలర్ రిలీజ్ చేయడంతో సినిమా మీద అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి. మరి లోకేష్ కనకరాజు సైతం కూలీ సినిమాని చాలా ఎఫెక్టివ్ గా తెరకెక్కిస్తున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఎన్టీఆర్ వార్ 2 ముందు రజనీకాంత్ కూలీ నిలబడుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి…
Also Read: ‘వార్ 2’ లో ఎవరు హీరో..? ఎవరు విలన్..? ట్రైలర్ అయ్యోమయంలోకి నెట్టేసిందిగా!
అయితే లోకేష్ కనకరాజు కూలీ సినిమాని ఒక డిఫరెంట్ తరహాలో తెరకెక్కిస్తున్నాడు. విక్రమ్ (Vikram) సినిమాతో ఎలాంటి మ్యాజిక్ అయితే చేశారో కూలీ సినిమాతో కూడా అలాంటి మ్యాజిక్ చేయడానికి లోకేష్ రెడీ అవుతున్నాడు… వార్ 2 సినిమాలో ఇటు హృతిక్ రోషన్, అటు ఎన్టీఆర్ ఇద్దరు సమఉజ్జీలుగా పోటీ పడబోతున్నారు.
ఈ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే కథలో చాలా ట్విస్టూలు అయితే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ ఒకరికొకరు ఎందుకు పోటీపడుతున్నారు. ఒకరితో ఒకరికి సంబంధం ఏంటి?వీళ్ళిద్దరూ ఎవరు అనేదే ఫైనల్ ట్విస్ట్ గా తెలుస్తోంది. ఒకవేళ ట్విస్ట్ కనక ప్రేక్షకులందరికి కనెక్ట్ అయితే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది…
ఇక కూలీ సినిమా లో కథ పెద్దగా లేకపోయిన కూడా లోకేష్ కనకరాజు మేకింగ్ మీద ఎక్కువ దృష్టిని పెడతాడు కాబట్టి ఆ సినిమా ఎలాంటి ఐడెంటిటిని సంపాదించుకుంటుంది. ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ని వదిలితే గాని ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయం మీద క్లారిటీ అయితే రాదు…ప్రస్తుతానికైతే వార్ 2 టాప్ పొజిషన్ లో ఉంది…