Sujeeth OG movie: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడికి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్… సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన సుజీత్ తో చేసిన ఓజీ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా కోసం తను విపరీతంగా కష్టపడినట్టుగా డైరెక్టర్ సుజీత్ సైతం తెలియజేశాడు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో మరోసారి తన స్టార్ డమ్ ను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం కేటాయించిన డేట్స్ ని సైతం చాలా పకడ్బందీగా వాడుకున్నాడు. మరి ఏదేమైనా దర్శకుడు ఈ సినిమాని ఎలా తీర్చిదిద్దుతున్నాడు అనేదాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఓవర్ నైట్ లో పాన్ ఇండియాలో స్టార్ హీరోగా మారిపోతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇప్పుడున్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బయటపడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం ఇప్పటివరకు పాన్ ఇండియా మార్కెట్ అయితే పెద్దగా క్రియేట్ అవ్వలేదు. ఈ సినిమాతో క్రియేట్ అవుతుందా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
తన అభిమానులు సైతం పాన్ ఇండియాలో పవన్ కళ్యాణ్ ప్రభంజనాన్ని సృష్టిస్తే చూడాలని అనుకుంటున్నారు… సుజీత్ ఈ సినిమాని మొదట పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకోలేదట. సాహో సినిమా అయిపోయిన తర్వాత ఈ కథ ను ప్రభాస్ కి వినిపించారట. కానీ ప్రభాస్ అప్పటికి వేరే సినిమాలకు కమిట్ అయి ఉండటం వల్ల తను ఈ సినిమాకి నో చెప్పినట్టుగా తెలుస్తోంది.
దాంతో పవన్ కళ్యాణ్ నుంచి సుజీత్ కి ఆఫర్ రావడంతో పవన్ కళ్యాణ్ కి ఈ కథ వినిపించి సినిమా చేశాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తోంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ప్రభాస్ రిజెక్ట్ చేసిన కథతో పవన్ కళ్యాణ్ తో సినిమా చేశాడు. కాబట్టి ఈ మూవీతో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. సుజీత్ పాన్ ఇండియాలో టాప్ డైరెక్టర్ గా ఎదుగుతాడా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…