https://oktelugu.com/

Sarath Kumar- Radhika: డబ్బు కోసమే శరత్ కుమార్ రాధికను పెళ్లి చేసుకున్నారా? అందుకే అగ్రిమెంట్ మీద సంతకం చేశారా?

నటి రాధికకు కూడా అది మొదటి పెళ్లి కాదు. అప్పటికే ఇద్దరిని పెళ్లి చేసుకున్న రాధిక మూడవ పెళ్లిగా శరత్ కుమార్ ను పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికంటే ముందే నటి దేవయానిని పెళ్లి చేసుకుంటారని టాక్ వచ్చింది.

Written By: , Updated On : October 19, 2023 / 02:49 PM IST
Sarath Kumar- Radhika

Sarath Kumar- Radhika

Follow us on

Sarath Kumar- Radhika: కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ లుగానే కాదు మంచి జంటగా మంచి గుర్తింపు సంపాదించిన వారిలో శరత్ కుమార్, రాధిక ఒకరు. శరత్ కుమార్ నటుడుగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా రాణించారు. కానీ ఈయన గురించి ఓ పుకారు అప్పట్లో షికారు చేసింది. హీరోగా కొనసాగుతున్న సమయంలో శరత్ కుమార్ ఇతర హీరోయిన్ లను లైన్ లో పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసేవారట. ఎంతో మంది హీరోయిన్ లు తన ట్రాప్ లో పడి రిలేషన్ వరకు కూడా వెళ్లారట. అయితే అప్పటికే పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తండ్రిగా ఉన్న శరత్ కుమార్ రాధికను రెండో వివాహం చేసుకున్నారు.

నటి రాధికకు కూడా అది మొదటి పెళ్లి కాదు. అప్పటికే ఇద్దరిని పెళ్లి చేసుకున్న రాధిక మూడవ పెళ్లిగా శరత్ కుమార్ ను పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికంటే ముందే నటి దేవయానిని పెళ్లి చేసుకుంటారని టాక్ వచ్చింది. దీనికి ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకున్నాయి. కానీ చివరి సమయంలో శరత్ కుమార్ రాధికను పెళ్లి చేసుకున్నారు. దీంతో దేవయాని మరో డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది. ఇలా దేవయానిని కాదని రాధికను పెళ్లి చేసుకోవడానికి కారణం డబ్బే అని తెలుస్తుంది. అప్పటికే సినిమాలు నిర్మించిన శరత్ కుమార్ భారీగా నష్టపోయారట. మరోవైపు రాధిక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ చాలా డబ్బు సంపాదించింది. అదే సమయంలో శరత్ కుమార్ స్నేహితుడు రాధికను పరిచయం చేసి ఆమె నుంచి కొంత డబ్బును అప్పుగా కూడా తీసుకున్నారట.

రాధిక నుంచి అప్పు తీసుకోవడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందట. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. కానీ అప్పటికే శరత్ కుమార్ గురించి తెలిసిన రాధిక.. పెళ్లి చేసుకోవాలంటే కొన్ని కండీషన్లు పెట్టిందట. పెళ్లి తర్వాత ఆస్తి మొత్తం శరత్ కుమార్ పేరు మీద రాస్తాను అని చెప్పిందట. కానీ ఏ అమ్మాయి వంక చూడవద్దని..అగ్రిమెంట్ పై సంతకం తీసుకుందట. అప్పుడు ఈ నటుడు కూడా సంతకం చేశారట. ఇక ఈ అగ్రిమెంట్ కు సంబంధించి ప్రస్తుతం వార్తలు వైరల్ అవడంతో అందరూ షాక్ అవుతున్నారు.