Divya Bharathi: తమిళ పరిశ్రమలో స్టైలిష్ హీరోయిన్ గా పేరుగాంచారు దివ్యభారతి.. దివ్యభారతి అనగానే దివంగత నటి గుర్తుకు వచ్చిందా…? కానీ ఆమె కాదు.. బ్యాచిలర్ సినిమా ద్వారా కథనాయకగా అడుగుపెట్టిన సుందరి దివ్యభారతి… తమిళ పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా హీరోగా పేరు గడించిన జీవీ ప్రకాశ్ సరసన నటించారు.. ఈ జూనియర్ దివ్యభారతి మొదటి సినిమాతోనే యువతను ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. బ్యాచిలర్ విజయవంతమైన తరువాత జీవీ ప్రకాశ్, దివ్య భారతి మరోసారి జోడీ కడుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో కింగ్ స్టన్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే జూనియర్ దివ్యభారతి ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఇష్క్ సినిమా తమిళ రీమేక్ లో నటిస్తున్నారని సమాచారం.
ఇదంతా కాసేపు పక్కన పెడితే ఈ తమిళ భామ దివ్య భారతి తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టబోతున్నారు. సుడిగాలి సుధీర్ సరసన ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా ఆదరిస్తారోనన్నది వేచి చూడాలి.. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న దివ్యభారతి సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ తో పాటు వీడియోస్ ను షేర్ చేస్తూ నెటిజన్ల నుంచి ప్రశంసలు పొందుతుంటారు.అంతేకాదు ఈ భామ ఏ మాత్రం ఖాళీ దొరికినా మాల్దీవులకు వెళ్లి, ఫొటోషూట్ లతో రచ్చ చేస్తుంటారట. ఈ ఫొటో షూట్స్ తోనే ఆమెకు సినిమాల్లో నటించే అవకాశం కూడా వచ్చిందని తెలుస్తోంది.
ఇందులో భాగంగానే తాజాగా దివ్య భారతి సాగర తీరాన సరదాగా గడిపిన క్షణాలను ఫొటోస్ రూపంలో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దివ్యభారతి షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ గా మారాయి. సాగర తీరాన అందాల దేవకన్య అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలా బీచ్ అందాల నడుమ ఈ ముద్ధుగుమ్మ హోయలతో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తుంది.