Samantha Myositis: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ అని తేడా లేకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు సమంత..ఒక టాప్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఈమె చేసే సేవ కార్యక్రమాలు ఏ హీరోయిన్ కూడా చెయ్యదు అనడం లో ఎలాంటి అతిశయం లేదు..తన జీవితం లో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా వెనకడుగు వెయ్యకుండా అవరోధాలన్నిటిని విజయవంతంగా దాటుకుంటూ ఎంతో మంది ఆడవాళ్ళకి ఆదర్శంగా నిలిచారు ఆమె.

5 ఏళ్ళ క్రితం తాను ఎంతగానో ప్రేమించిన నాగ చైతన్య ని పెళ్ళాడి..తన దురదృష్టం కొద్దీ ఏడాది క్రితం విడాకులు తీసుకొని కూడా ధైర్యంగా నిలబడి ముందుకి సాగే ప్రయత్నం చేసింది..కానీ ఈ ప్రయత్నం ఆమె ఎంతో మానసిక ఒత్తిడికి గురైంది..ఈ సమాజం లో ఒక అమ్మాయి విడాకులు తీసుకుంటే ఎన్ని నిందలు మొయ్యాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..సమంత ఆ నిందలన్నిటిని మోసింది..ఈ క్రమం లో ఆమె మానసికంగా ఎంతో కృంగిపోయింది.
సమంతకి ఎప్పటి నుండో మయోసిటిస్ అనే అరుదైన ప్రాణాంతక వ్యాధి ఉంది..ఈ వ్యాధి ఉన్నవారు ఎక్కువ ఒత్తిడికి గురి అవ్వకూడదు..కానీ సమంత నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత దాదాపుగా ప్రాణాలను కోల్పోయినంత ఒత్తిడికి గురైంది..షూటింగ్ సెట్స్ లో కూడా ఆమె ఖాళి సమయాల్లో ఏడుస్తూ కూర్చునేది అట..మానసికంగా ఆమె అంతలా కృంగిపోయింది..ఆ సమయం లో మయోసిటిస్ వ్యాధి ఆమెలో లక్షణాలు తీవ్రస్థాయిలో పెరిగిపోయిందట..సమంత నేరుగా ఈ విషయం చెప్పకపోయినా ఆమె సన్నిహిత వర్గాలు చెప్పుకొచ్చాయి..ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న ఈమె త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుకుందాము.

ఇక ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం యశోద రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా సమంత కొన్ని ఇంటర్వూస్ ఇచ్చింది..ఈ ఇంటర్వూస్ లో ఆమె ఎమోషనల్ గా మాట్లాడుతూ కంటతడి పెట్టుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు..ఎలా అయినా ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.