Allu Arjun And RGV: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ…ఆయన తీసిన చాలా సినిమాలు గొప్ప విజయాలను సాధించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పిస్తూ వచ్చాయి. ఇక ఏది ఏమైనా కూడా ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపించిన విషయం మనకు తెలిసిందే…ఒకప్పుడు స్టార్ హీరోలు సైతం అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు కూడా ఆయన సినిమాలు చేస్తున్నప్పటికి అవి ప్రేక్షకులను పెద్దగా మెప్పించడం లేదు. తనకు నచ్చిన సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఒకప్పుడు ఆయన వరుసగా మంచి సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇక ఇదే క్రమంలో అల్లు అరవింద్ తన కొడుకైన అల్లు అర్జున్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసే క్రమంలో రామ్ గోపాల్ వర్మతో మొదటి సినిమా చేయాలని అనుకున్నారట.
కానీ వర్మ మాత్రం అప్పుడు అల్లు అర్జున్ తో తను సినిమా చేయలేనని చెప్పినట్టుగా తెలుస్తోంది. కారణం ఏంటి అంటే ఆర్జీవీ అప్పుడు బాలీవుడ్ లో సినిమా చేస్తూ బిజీ గా ఉన్నాడు. మొత్తానికైతే అల్లు అర్జున్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.
అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. గత సంవత్సరం ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు.ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నాడు. ఇక ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే సంవత్సరం ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు…చూడాలి మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ మరోసారి గొప్ప విజయాన్ని సాధిస్తాడా..? 2000 కోట్లకు పైన కలెక్షన్స్ కొల్లగొడుతాడా లేదా అనేది…