Rajamouli: పాన్ ఇండియా ను శాసిస్తున్న దర్శకుల్లో రాజమౌళి మొదటి స్థానంలో ఉన్నాడు. ఒకప్పుడు బాలీవుడ్ డైరెక్టర్స్ తెలుగు సినిమాలను చాలా చిన్నచూపు చూసేవాళ్లు…మన హీరోలతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ దర్శకులు ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు. మన దర్శకులతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ హీరోలు సైతం ఆసక్తిగా ఉండేవారు కాదు. అలాంటి ఒక గడ్డు పరిస్థితి నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని టాప్ లెవెల్ కి తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే దక్కుతోంది. ఆయన చేసిన బాహుబలి సినిమాతోనే పాన్ ఇండియా ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది. అప్పటినుంచి ఆయన ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు… ఇక అతని డైరెక్షన్ లో నటించడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి నటుడు ఆసక్తిగా ఉన్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సైతం స్టార్ హీరోగా వెలుగొందుతున్న సూర్యతో రాజమౌళి రెండు సినిమాలు చేయాల్సి ఉందట.
కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమాలు మిస్ అయ్యాయి. ఆ సినిమాలు ఎంతంటే ఒకటి రవితేజ హీరోగా వచ్చిన ‘విక్రమార్కుడు’ కాగా, మరొకటి రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘మగధీర’ సినిమా కావడం విశేషం…ఇక అప్పటినుంచి రాజమౌళి డైరెక్షన్లో ఏ చిన్న ఛాన్స్ వచ్చినా సరే నేను చేస్తాను అని సూర్య చెబుతుండడం విశేషం…
ఇక ఈ రెండు సూపర్ హిట్ సినిమాలను సూర్య ఎందుకు వదిలేసుకున్నాడు అంటే అప్పుడున్న పరిస్థితుల వల్ల రాజమౌళి మొదట సూర్య ను హీరోగా పెట్టీ చేయాలని అనుకున్నప్పటికి కొన్ని అనివార్య కారణాల వల్ల అది వర్కౌట్ కాలేదట. దాంతో అతన్ని పక్కన పెట్టేసి ఆ మూవీస్ కి తెలుగు హీరోలు అయితేనే బాగుంటుందనే ఉద్దేశ్యంతో రాజమౌళి మన హీరోలతోనే సినిమాలు చేశాడు. ఆ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడంతో సూర్య చాలా వరకు తన కెరీర్ ని మిస్సయ్యాడనే చెప్పాలి.
ఈ రెండు సినిమాలు కనక సూర్యకి పది ఉంటే ఆయన ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులో కూడా నెంబర్ వన్ హీరోగా స్టార్ అవతరించేవాడు అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం… ఇక ఫ్యూచర్లో అయిన రాజమౌళి సూర్య కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…