Shravan Sai Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన శ్రవణ్ సాయి అలియాస్ శివ (19) కేసులో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాదులోని మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ లోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీ లో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు శ్రవణ్ సాయి. కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఓ ప్రాంతంలో అద్దెకుమంటున్నాడు.. శ్రవణ్ సాయి పదో తరగతి వరకు కూకట్పల్లి లోని ప్రగతి నగర్ ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాలలో చదువుకున్నాడు.
తను పాఠశాలలో చదువుకుంటున్నప్పుడే ఆ యువతి శ్రవణ్ కు పరిచయం ఆ తర్వాత వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది అది కాస్త ప్రేమకు దారి తీసింది. కొంతకాలంగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇదే సమయంలో వారిద్దరి వ్యవహారం రెండు కుటుంబాల సభ్యులకు తెలిసింది. అమ్మాయి తరఫు వారు ఈ ప్రేమ వ్యవహారాన్ని తప్పు పట్టారు. అంతేకాదు ఇంకోసారి మా అమ్మాయి తో కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అయినప్పటికీ శ్రవణ్ తన ధోరణి మార్చుకోలేదు ఇటీవల ఆ అమ్మాయి ఇంటికి అతడు వెళ్ళాడు ఆ సమయంలో అమ్మాయి తరఫు బంధువులకు, శ్రావణ్ కు వాగ్వాదం జరిగింది.. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి చేయి విరిగింది.. ఆ తదుపరి శ్రావణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
ఆ యువతి కుటుంబ సభ్యులు కొట్టినందువల్లే తమ కుమారుడు చనిపోయాడని శ్రావణ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై పోలీసులకు కూడా వారు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు శ్రావణ్ కారణంగా తమ కుమార్తె గర్భవతి అయిందని ఆ యువతీ తల్లి చెబుతోంది. అందువల్లే అతడిని కొట్టానని పోలీసుల దర్యాప్తులో ఆ యువతి తల్లి చెప్పినట్లు తెలుస్తోంది. గండి మైసమ్మ పార్కు వద్ద ఇద్దరు కలుసుకున్నారని.. వారిద్దరూ శారీరకంగా కలుసుకోవడం వల్లే తమ కుమార్తె గర్భవతి అయిందని ఆ యువతి తల్లి చెబుతోంది..” ఆ యువకుడిని నేను చూడడం ఇది రెండవసారి.. కొద్దిరోజుల క్రితం ఆ అబ్బాయి ఫ్యామిలీ వాళ్లకు కూడా వార్నింగ్ ఇచ్చాం. ఏం జరిగిందో కొద్ది రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ కు వచ్చి వివరంగా చెప్తాం. మా అమ్మాయి గర్భవతి.. ఇద్దరు శారీరకంగా కలిశారు కాబట్టి అలా జరిగింది. నా కూతురు ప్రాబ్లం కాబట్టి అతనిని కొట్టానని” ఆ యువత తల్లి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.