https://oktelugu.com/

Rajamouli and Mahesh Babu : రాజమౌళి మహేష్ బాబు చేత ఆ క్యారెక్టర్ చేయించాలి అనుకున్నాడా.? మరి ఎందుకు మిస్ అయింది..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే వాళ్ల సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియాలో కూడా వాళ్ల స్టామినా ఏంటో చూపించుకుంటున్నారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు లాంటి స్టార్ హీరో అయితే ఏకంగా పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : January 4, 2025 / 10:50 AM IST

    Rajamouli , Mahesh Babu

    Follow us on

    Rajamouli and Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన సాధించిన విజయాలు ఆయనను చాలా గొప్పగా పరిచయం చేస్తూ ఉంటాయి. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఇప్పటివరకు 100% సక్సెస్ రేట్ ఉన్న సినిమా డైరెక్టర్ ఎవరు లేరు. అలాంటిది రాజమౌళి తీసిన సినిమాలు అన్నీ సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఆయనకు చాలా మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు అడ్వెంచర్స్ చేస్తూ సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడిని అలరించే ప్రయత్నం అయితే చేయబోతున్నాడు. మరి ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ రాజమౌళి ఇంతకు ముందే మహేష్ బాబు తో సినిమా చేయాలని కమిట్ అయ్యాడు. మర్యాద రామన్న సినిమా సమయంలోనే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉంది.

    ఇక అప్పుడే మహేష్ బాబు కూడా రాజమౌళి కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నాను అంటూ ఒక ట్వీట్ కూడా చేశాడు… ఇక ఆ సమయం లో ఇద్దరు బిజీగా ఉండడం వల్ల సినిమా చేయడానికి వీలు కాలేదు. మరి మొత్తానికైతే రాజమౌళి మహేష్ బాబుతో ఈ సినిమా కాకుండా ఇంతకుముందు ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో మహేష్ బాబును చూపించాలనే ప్రయత్నం అయితే చేశారట.

    విక్రమార్కుడు సినిమాలో ‘విక్రమ్ సింగ్ రాథోడ్’ ఎలాంటి పవర్ ఫుల్ క్యారెక్టరో దానికి తగ్గట్టుగా మహేష్ బాబుని అలాంటి ఒక పవర్ ఫుల్ పాత్రలో చూపించే ప్రయత్నం చేయాలని అనుకున్నప్పటికి ఆ సినిమా చేసే సందర్భం అయితే వీళ్లకు వీలు పడలేదట. దాంతో ఇప్పుడు అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి సినిమా చేసే కంటే అడ్వెంచర్ జానర్ లో సినిమా చేస్తే పాన్ వరల్డ్ లో రీచ్ ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ సినిమా ను ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది…

    మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు ఏ పాత్రలో అయినా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతూ ఉంటాడు. ఇక రాజమౌళి మేకింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ సినిమా తీసిన కూడా అందులో తన మార్క్ అయితే ఉంటుంది…