
Rajamouli Mahesh : దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli)తో సినిమా చేయాలని చిరంజీవి నుంచి రజినీకాంత్ వరకు అందరూ అగ్రహీరోలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ మన జక్కన్న మాత్రం తన కథకు తగ్గ యంగ్ హీరోలనే ఎంపిక చేసుకుంటున్నారు. సీనియర్ల జోలికి అస్సలు పోవడం లేదు. తెలుగులో చిరంజీవి ఎన్నో సార్లు ఒకసినిమా అయినా రాజమౌళితో చేయాలని చూస్తున్నా జక్కన్న మాత్రం చేయడం లేదు.
చిరు, నాగ్, బాలయ్య, వెంకటేశ్ లతో అసలు రాజమౌళి ఇంతవరకు సినిమా చేయలేదు. యంగ్ హీరోలతోనే కానిచ్చేస్తున్నారు. ముందుగా కథను ఓకే చేసుకొని అనంతరం హీరోలను ఎంపిక చేస్తున్నాడు.
ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’తో రాజమౌళి మరో ప్యాన్ ఇండియా మూవీని తీస్తున్నారు. రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
అయితే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఇప్పటికే అనౌన్స్ చేసిన మూవీ మహేష్ బాబు (Mahesh)తో.. దుర్గా ఆర్ట్స్ అధినేత నిర్మాత.. రాజమౌళి ఈ సినిమా కోసం దక్షిణాఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్, అడ్వంచర్ కథను తయారు చేయమని ఇప్పటికే తండ్రి విజయేంద్రప్రసాద్ కు చెప్పాడట.. దాని పనిలోనే ఆయన ఉన్నాడు.
అయితే తాజాగా రాజమౌళి షాకిచ్చినట్టు సమాచారం. రాజమౌళి నిన్న రాత్రి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలతో భేటి అయినట్టు సమాచారం. ఒక భారీ బడ్జెట్ మూవీ తీయడానికి వారితో సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారివారి పాట’తోపాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యేసరికి వేసవి వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే మహేష్ బాబును పక్కనపెట్టి రాజమౌళి మరో హీరోతో ఈ గ్యాప్ లో మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
సహజంగానే రాజమౌళి సినిమా తీస్తే రెండు మూడేళ్లు గ్యారెంటీగా పడుతుంది. దీంతో మహేష్ బాబుతో మూవీని రాజమౌళి పక్కనపెట్టేసినట్టే అన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.