Rajamouli Advice For Pushpa: గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల అయినా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా ఒక్క తెలుగు లోనే కాదు హిందీ , తమిళం , మలయాళం బాషలలో సెన్సేషన్ సృష్టించింది..మన టాలీవుడ్ నుండి ఇప్పటి వరుకు కేవలం రాజమౌళి సినిమాలు మాత్రమే ఇతర బాషలలో క్లిక్ అవ్వడం మనం చూసాము..కానీ మొదటిసారి రాజమౌళి ప్రమేయం లేకుండా ఇతర బాషలలో విడుదల అయ్యి సంచలన విజయం సాధించిన ఏకైక సినిమాని పుష్ప ద్వారానే మనం మొదటిసారి చూసాము..దీనితో ఈ మూవీ సీక్వెల్ పై ప్రతి ఇండస్ట్రీ లోను అంచనాలు తారాస్థాయికి చేరింది..ఇప్పటికే స్క్రిప్ట్ పనులు మొత్తం పూర్తి చేసిన ఆ చిత్ర దర్శకుడు సుకుమార్, ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించేసాడు..వచ్చే నెల ప్రారంభం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక్క ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..అదేమిటి అంటే ఈ సినిమాని తొలుత డైరెక్టర్ సుకుమార్ కేవలం తెలుగు లో మాత్రమే తియ్యాలి అని అనుకున్నాడు అట..తన ప్రతి సినిమా స్టోరీ ని ఇండస్ట్రీ లో తన్న సన్నిహితుడు అయినా రాజమౌళి కి చెప్పే అలవాటు ఉన్న సుకుమార్..ఈ సినిమా స్టోరీ ని కూడా రాజమౌళి కి చెప్పాడట..స్టోరీ విని ఎంతో సంబ్రమాశ్చర్యానికి గురి అయినా రాజమౌళి..ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్ లో అన్ని బాషలలో విడుదల చెయ్యమని సుకుమార్ కి సలహా ఇచ్చాడట..సుకుమార్ తొలుత అంత సాహసించలేకపొయ్యాడు..కానీ రాజమౌళి ఈ సినిమా కచ్చితంగా ప్రభంజనం సృష్టిస్తుంది..విడుదల చెయ్యకపోతే మంచి మార్కెట్ ని వదులుకున్న వాడివి అవుతావు అని పట్టుబట్టడం తో సుకుమార్ పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కించబోతున్నాము అని అధికారిక ప్రకటన చేసాడు..అలా ఈ సినిమా ప్రారంభం అయ్యి అన్ని బాషలలో విడుదలై ప్రభంజనం సృష్టించింది.

Also Read: YSRCP MLC Anantha Babu: డెడ్ బాడీని వదలని ఎమ్మెల్సీ అనంతబాబు.. డ్రైవర్ చనిపోయాక ఏం చేశాడో తెలుసా?
అలా రాజమౌళి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఈ సినిమా ఇంతటి విజయం సాధించడానికి కారణం అయ్యాడు..గమ్మత్తు ఏమిటి అంటే ఈ సినిమా తెలుగులో కంటే కూడా హిందీ లోనే భారీ విజయం సాధించింది..హిందీ లో ఈ సినిమా భారీ విజయం సాధించడమే కాకుండా అల్లు అర్జున్ కి అక్కడి స్టార్ హీరోలకు సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సృష్టించేసింది..ఇక పుష్ప పార్ట్ 2 ఏ స్థాయిలో విజయం సాధించబోతుందో చూడడం కోసం అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు
కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..బాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇటీవలే విడుదల అయినా KGF చాప్టర్ సినిమా బాలీవుడ్ లో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా సంగతి మన అందరికి తెలిసిందే..పుష్ప పార్ట్ 2 దానికి మించి విజయం సాధిస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..చూడాలి మరి మరోసారి అల్లు అర్జున్ తన మేజిక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ సృష్టిస్తాడో అనేది.
Also Read: Chiranjeevi Missed Basha Movie: బాషా సినిమాని చిరంజీవి మిస్ అవ్వడానికి కారణం ఎవ్వరో తెలుసా..?
[…] […]
[…] […]