https://oktelugu.com/

Prabhas: రానా చేయాల్సిన ఆ సినిమా ప్రభాస్ చేశారా?

రానా లీడర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇక డార్లింగ్ సినిమాలో రానా ప్లేసులో మాత్రం ప్రభాస్ నటించి సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకున్నారు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో మంచి హిట్ గా నిలిచింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 2, 2024 / 03:59 PM IST
    Follow us on

    Prabhas: శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లీడర్ సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన రానా మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపును సంపాదించారు. ఈయన నటనతో ఎంతో మందిని ఆకర్షించారు. విలన్, హీరో ఏ పాత్ర అయినా ఒదిగిపోయే ఈ నటుడికి అభిమానులు ఎక్కువే. ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవకపోవడంతో రానా మొదటి స్టెప్ లోనే హీరోగా ఫెయిల్ అయ్యారు.

    ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా సక్సెస్ ను సాధించలేదు. ఇక ఈ క్రమంలోనే ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కరుణాకరన్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలి అనుకున్నారు. అదేనండి డార్లింగ్ సినిమా కోసం మొదటగా రానానే సంప్రదించారట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది.

    రానా లీడర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇక డార్లింగ్ సినిమాలో రానా ప్లేసులో మాత్రం ప్రభాస్ నటించి సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకున్నారు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో మంచి హిట్ గా నిలిచింది. ఇలా రానా చేయాల్సిన సినిమాతో ప్రభాస్ భారీ సక్సెస్ ను అందుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉంటే.. రానా కూడా తన సినిమాలతో బిజీగా ఉన్నారని టాక్.

    ఈ ఇద్దరు స్టార్లు కలిసి బాహుబలి సినిమాలో నటించి పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. ఇక నేనే రాజు నేనే మంత్రి సినిమాతో రానా సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. కానీ డార్లింగ్ సినిమాలో నటించకపోవడంతో ఒక సూపర్ హిట్ ను మాత్రం కోల్పోయారు రానా.