NTR Son Jayakrishna: విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న నటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు(NTR). సినిమా ఇండస్ట్రీలో హీరో గానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా కూడా ఆయన ఎనలేని సేవలను అందించాడు. అయితే ఎన్టీఆర్ మాత్రం తన నట వారసుడిగా తన పెద్ద కుమారుడైన ‘రామకృష్ణ ‘ ని ఇండస్ట్రీకి తీసుకురావాలనే ప్రయత్నం చేశాడు. కానీ రామకృష్ణ కి 17 సంవత్సరాల వయసు లో ‘మసూచి ‘ వ్యాధి సోకడంతో తను చనిపోయాడు. ఇక దాంతో తన రెండో కుమారుడు అయిన జయకృష్ణ ను ఇండస్ట్రీకి తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పటికీ అది సక్సెస్ కాలేదు.
ఎందుకు అంటే ఎన్టీఆర్ జయ కృష్ణ కి స్క్రీన్ టెస్ట్ చేయడానికి కొన్ని ఫొటోస్ తీసుకొని అలాగే కొన్ని డైలాగ్స్ ని కూడా చెప్పమని తనకి చెప్పాడట. దాంతో జయకృష్ణ డైలాగులు బట్టి పట్టినప్పటికీ కెమెరా ముందుకు వచ్చేసరికి మాత్రం మర్చిపోవడం గాని, తడబడడం గానీ చేశాడట. దాంతో స్క్రీన్ టెస్ట్ ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 10 అయిన కూడా ఆ రెండు డైలాగులు చెప్పలేకపోవడంతో ఎన్ టి ఆర్ నువ్వు ఆర్టిస్ట్ గా పనికి రావని అందరి ముందే తనని తిట్టాడట. దాంతో జయ కృష్ణ తీవ్రమైన మనస్థాపానికి గురై ఇక లైఫ్ లో ఒక్కసారి కూడా మేకప్ వేసుకోను అనే నిర్ణయం తీసుకున్నాడట.
ఇక జయకృష్ణ విషయంలో ఎన్టీఆర్ అలా అందరి ముందు తిట్టేకంటే, తనని పర్సనల్ కూర్చోబెట్టి తనకి చెప్పి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయిస్తే బాగుండేది అని, అలా చేస్తే నందమూరి ఫ్యామిలీ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడమే కాకుండా, స్టార్ హీరో గా కూడా కొనసాగే వాడని ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నందమూరి అభిమానులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు…
ఇక తనని ఇండస్ట్రీలో హీరోగా రాకుండా ఎన్టీఆర్ అడ్డుకున్నాడని అప్పట్లో చాలా కథనాలు కూడా వచ్చాయి. ఇక ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ మాత్రం తన వారసుడిగా బాలకృష్ణ నే ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా తండ్రికి తగ్గ తనయుడుగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…